గుడ్ న్యూస్.. హైవేలపై మీరు ఎంత ప్రయాణిస్తే అంతే టోల్‌ చార్జీలు.. ఫాస్ట్‌ట్యాగ్‌తో రూ.20 వేల కోట్ల ఆదా

First Published Mar 2, 2021, 11:56 AM IST

న్యూ ఢీల్లీ: ఫాస్ట్‌ట్యాగ్‌ను  ఉపయోగించడం వల్ల ప్రతి సంవత్సరం ఇంధన వ్యయంపై సుమారు రూ .20,000 కోట్లు ఆదా అవుతుందని అలాగే కనీసం 10,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పెంచుతుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం అన్నారు.  చెప్పారు.
 

"హైవేలపై ఎలక్ట్రానిక్ టోల్ చార్జి వసూల్ చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్‌లను తప్పనిసరి చేయడంవల్ల టోల్ ప్లాజాల వద్ద రద్దీ గణనీయంగా తగ్గించింది. దీనివల్ల ఇంధన వ్యయంపై సంవత్సరానికి రూ .20,000 కోట్లు ఆదా అవుతుంది" అని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.
undefined
దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాల పరిస్థితిని అంచనా వేయడానికి నితిన్ గడ్కరీ ప్రత్యక్ష పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా 'రేటింగ్ అండ్ ర్యాంకింగ్ ఆఫ్ నేషనల్ హైవే స్ట్రెచెస్' అనే రేటింగ్ సిస్టమ్‌ను విడుదల చేశారు. రహదారి వినియోగం, నిర్మాణం, నాణ్యత పరంగా సాధించే దశ అని గడ్కరీ అన్నారు.
undefined
టోలింగ్ కోసం కొత్త జిపిఎస్ ఆధారిత వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ వ్యవస్థలో హైవే ప్రయాణికులు ఎంట్రీ నుండి ఎగ్జిట్ పాయింట్ల ఆధారంగా ప్రయాణించిన దూరానికి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఈ వ్యవస్థను ప్రవేశపెట్టడానికి సుమారు రెండు సంవత్సరాలు పడుతుందని అన్నారు.
undefined
ఫాస్ట్ ట్యాగ్ వాడకం తప్పనిసరి అయిన తరువాత టోల్ వసూలు స్థిరంగా పెరిగాయని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) తెలిపింది. ఫాస్ట్ ట్యాగ్ ద్వారా రోజువారీ టోల్ వసూలు సుమారు 104 కోట్లకు చేరుకుందని తెలిపింది.
undefined
"మొత్తం ఉన్న టోల్ ప్లాజాలలో 80 శాతం జీరో వేటింగ్ టైమ్ ఉందని ఇంకా ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి చేసిన తరువాత గత కొద్ది రోజులలో ఎలక్ట్రానిక్ టోలింగ్ ద్వారా టోల్ వసూలు 80 శాతం నుండి 93 శాతానికి చేరుకుంది" అని గడ్కరీ చెప్పారు. రహదారుల పక్కన హరిత తోటల పెంపకాన్ని మెరుగుపరిచేందుకు మొక్కల ఇ-ట్యాగింగ్ కూడా చేస్తామని చెప్పారు.
undefined
undefined
click me!