జనవరి 2022 నుండి జి‌ఎస్‌టిలో మార్పులు: ఆన్‌లైన్ బుకింగ్ నుండి కొనుగోళ్ల వరకు పెరగనున్న ఖర్చులు..

First Published Dec 27, 2021, 11:20 AM IST

ఈ ఏడాది మరికొద్దిరోజుల్లో ముగియనుంది మరోవైపు కొత్త సంవత్సరం 1  జనవరి 2022 నుండి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ (GST)నియమాలలో కొన్ని మార్పులు రానున్నాయి. దీనితో పాటు ఆన్‌లైన్ ఆటో రైడ్ ట్రావెల్, దుస్తులు, బూట్లు ధరించడం ఖరీదైనదిగా మారనున్నాయి. 

 జి‌ఎస్‌టి సిస్టంలో పన్ను రేటు అండ్ పాలసీకి సంబంధించిన మార్పులు సామాన్య ప్రజలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. ఈ మార్పుల ప్రకారం, రవాణా అండ్ రెస్టారెంట్ల విభాగంలో అందించే సేవలపై ఈ-కామర్స్ సర్వీస్ ప్రొవైడర్లు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

ఈ మార్పు టెక్స్‌టైల్ అండ్ ఫూట్ వేర్ రంగానికి సంబంధించిన డ్యూటి స్ట్రాక్చర్ కి కూడా వర్తిస్తుంది. దీని కింద అన్ని రకాల పాదరక్షలపై 12 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు పాదరక్షల ధర ఎంత అన్నది ముఖ్యం కాదు ఇప్పుడు రూ.100 విలువైన షూస్ కొనుగోలు చేసినా 12 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రూ.1000 లోపు ఉన్న పాదరక్షలపై 5 శాతం పన్ను ఉండేది.

అలాగే ఖాదీ మినహా అన్ని వస్త్ర ఉత్పత్తులపై కూడా 5 శాతానికి బదులుగా 12 శాతం జిఎస్‌టిని ఆకర్షిస్తుంది. కుట్టుపనిలో ఉపయోగించే పలు రకాల రేజర్లపై కూడా పన్నును పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో కుట్టిన రెడీమేడ్ దుస్తులను వేసుకోవాలంటే మరింత ఖర్చు అవుతుంది.

మరోవైపు, ఆటో రిక్షా డ్రైవర్లు ఆఫ్‌లైన్ మోడ్ ద్వారా అందించిన ప్రయాణీకుల రవాణా సేవలపై తగ్గింపును పొందడం కొనసాగిస్తారు. అయితే, ఈ సేవలను ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా అందించినప్పుడు మాత్రం ఐదు శాతం చొప్పున జి‌ఎస్‌టిని ఆకర్షిస్తాయి. 

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తే
స్వీగ్గి (Swiggy), జోమాటో (Zomato) వంటి ఈ-కామర్స్ కంపెనీలు కూడా విధానపరమైన మార్పులలో భాగంగా తమ సేవలపై జి‌ఎస్‌టిని వసూలు చేస్తాయి. కంపెనీలు ఈ సేవలకు బదులుగా జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం వారు సర్వీస్ బిల్లును జారీ చేయాలి. ఇప్పటికే రెస్టారెంట్లు జీఎస్టీని వసూలు చేస్తున్నందున వినియోగదారులపై అదనపు భారం పడనుంది. 

పన్ను జమ చేయడం, బిల్లుల జారీ బాధ్యత ఇప్పుడు ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లదే. 

ఫుడ్ డెలివరీ ఫోరమ్‌ల ద్వారా సమాచారాన్ని బహిర్గతం చేయకపోవడంతో గత రెండేళ్లలో ఖజానాకు దాదాపు రూ.2,000 నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేయడంతో ఈ చర్య తీసుకుంది. 

జి‌ఎస్‌టిని డిపాజిట్ చేయడానికి ఈ ఫోరమ్‌లను జవాబుదారీగా చేయడం పన్ను ఎగవేతను చెక్ చేస్తుంది. 

ఆధార్ ధ్రువీకరణ అవసరం
 పన్ను ఎగవేత నివారించడానికి ప్రభుత్వం జిఎస్టి రిటర్న్ కోసం ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేసింది. 1 జనవరి  2022 నుండి పాన్-ఆధార్ లింక్ చేయని వ్యాపారవేత్తల జి‌ఎస్‌టి రీఫండ్ నిలిపివేయబడుతుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్ డైరెక్ట్ ట్యాక్స్ అండ్ కస్టమ్స్ (CBIC) ప్రకారం, నకిలీ రిటన్ క్లెయిమ్‌లను తనిఖీ చేయడానికి ఆధార్ ధృవీకరణ తప్పనిసరి చేయబడింది. ఇప్పుడు జి‌ఎస్‌టి రిటర్న్ బ్యాంకు ఖాతాకు మాత్రమే పంపబడుతుంది. అది కూడా పాన్ తో లింక్ చేసి ఉంటేనే.

జి‌ఎస్‌టి రిటర్న్ వివరాలను ఫైల్ చేయడంలో డిఫాల్ట్ లేదా ప్రతి నెలా జి‌ఎస్‌టి చెల్లించని వ్యాపారాలు GSTR-1 సేల్స్ రిటర్న్‌ను ఫైల్ చేయడానికి అనుమతించబడవు. 
అంటే GSTR-3B ఫైల్ చేయని వారు కూడా GSTR-1 ఫైల్ చేయకుండా నిరోధించబడతారు.
ఒక వ్యాపారవేత్త  పాన్ లింక్ చేయని కారణంగా జి‌ఎస్‌టి రిజిస్ట్రేషన్ రద్దు చేయబడితే, అప్పుడు అతను రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేయలేరు.   

click me!