సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.. స్టార్ హీరో ధనుష్ నుండి విడిపోయిన తర్వాత... అప్పటి నుంచి తన తల్లిదండ్రులతో కలిసి తండ్రి ఇంట్లోనే ఉంటోంది. కాగా రీసెంట్ గా ఐశ్వర్య ఓ కొత్త ఇంటిని కొనుగోలుచేశారు. ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ప్లాట్ ను ఆమె కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇక రీసెంట్ గా గృహప్రవేశ వేడుకను నిర్వహాంచారు ఆమె.
Hero Dhanush
అయితే ఈ గృహప్రవేశ వేడుకల్లో ధనుష్ మాత్రం కనిపించలేదు. ఇద్దరు పరస్పరం అవగాహనతో విడిపోతున్నాము అని ప్రకటించారు. పిల్లల కోసం స్కూల్ ఆవెంట్స్ కు కూడా కలిసి హాజరయ్యారు.. ఇద్దరు తమ సినిమాలకు విష్ చేసుకుంటూనే ఉన్నారు. ఈక్రమంలో ఐశ్వర్య కొత్త ఇంటి వేడుకకు ధనుష్ ను ఎందుకు పిలవలేదు అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
రోజా, లయ, గౌతమి కూతుర్లను చూశారా..? హీరోయిన్లను మించిన అందం వారి సొంతం..
తన తల్లీ తండ్రుల కోసం ధనుష్ భారీ స్థాయిలో ఓ ఇల్లు నిర్మించి ఇచ్చాడు. ఆ విషయంలో ఐశ్వర్యకు ధనుష్ కు మధ్య మనస్పర్ధలు వచ్చాయి అని కోలీవుడ్ టాక్. ఇక ధనుష్ కు సవాల్ విసురుతూ ఇంటిని కొనుగోలు చేసింది ఐశ్వర్య. అయితే ఇంటి గ్రహప్రవేశం చాలా సింపుల్ గా జరిగింది.
ఈ వేడుకలకు ఐశ్వర్య తండ్రి రజినికాంత్, తల్లి లత, ఆమె ఇద్దరు కుమారులు లింగ, యాత్ర మరియు ఆమె స్నేహితురాలు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఇంటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వారసత్వం తీసుకుని.. ఆయన పెద్ద కూతురుగా ఐశ్వర్య సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
2012లో తన భర్త ధనుష్ హీరోగా '3' చిత్రానికి దర్శకత్వం వహించింది. బయో పోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధికి సంబంధించిన అంశాన్ని లీడ్ తీసుకుని రొమాంటిక్ మిక్స్డ్ కాన్సెప్ట్ తో ఐశ్వర్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా తర్వాత ఐశ్వర్య నటించిన వాయ్ రాజా వాయ్ అనుకున్న స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.
చాలా గ్యాప్ తర్వాత తన తండ్రి లీడ్ రోల్ లో 'లాల్ సలామ్' సినిమాను డైరెక్ట్ చేశారుఐశ్వర్య. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ అవ్వగా.. ఈమూవీ కూడా ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది.
క్రికెట్ ఆట చుట్టూ జరుగుతున్న రాజకీయాల గురించి మాట్లాడిన ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా, విక్రాంత్ రెండో హీరోగా నటించారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మొయిదీన్ భాయ్ పాత్రను పొడిగించిన అతిధి పాత్రలో పోషించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. సినిమా పరాజయానికి కారణం సినిమా షూటింగ్ వీడియో పోయిందంటూ ఐశ్వర్య సంచలనం సృష్టించింది.