తగ్గిన బంగారం, వెండి ధరలు.. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి ధర ఎంతంటే ?

First Published Sep 25, 2021, 12:51 PM IST

నేడు దేశీయ మార్కెట్‌లో గోల్డ్ అండ్  సిల్వర్ ఫ్యూచర్స్ పడిపోయాయి. ఎం‌సి‌ఎక్స్ లో  గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు 0.06 శాతం (రూ .29) తగ్గి రూ. 46,027 కి చేరుకుంది. వెండి కిలోకు 0.18 శాతం (రూ. 111) తగ్గి రూ .60,678 కి చేరుకుంది. గత సంవత్సరం గరిష్ట స్థాయి నుండి పసిడి ధర 10 గ్రాములకు రూ. 56,200 నుండి పసుపు లోహం ఇప్పటికీ రూ. 10,173 తగ్గింది.

ఆగస్టులో బంగారం దిగుమతులు ఎక్కువగా ఉన్నప్పటికీ భారతదేశంలో ఫిజికల్ గోల్డ్ డిమాండ్ బలహీనంగా ఉంది. దేశీయ డీలర్లు రాబోయే పండుగ సీజన్‌లో ఎక్కువ అమ్మకాలు ఉంటాయని  భావిస్తున్నారు. 

ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, డాలర్‌తో రూపాయి మారకం అస్థిరత విలువైన లోహం ధరలను ప్రభావితం చేస్తాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ ప్రకారం, అత్యధిక స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములకు రూ. 46,694 కు విక్రయిస్తుండగా, వెండి స్పాట్ మార్కెట్‌లో గురువారం కిలోకు రూ .60,788 కి విక్రయం అవుతున్నది. 
 

ఈరోజు ప్రపంచ మార్కెట్లలో స్పాట్ గోల్డ్ 0.2 శాతం పెరిగి ఔన్స్ కి 1,746.84 డాలర్లకు చేరుకుంది. యు.ఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 0.1 శాతం తగ్గి ఔన్సు కి 1,747.80 డాలర్లుగా ఉంది. ఇతర విలువైన లోహాలలో వెండి 0.5 శాతం పెరిగి ఔన్స్ 22.61 డాలర్లుగా ఉంది. పల్లాడియం 0.5 శాతం పెరిగి 1,992.67 డాలర్లుగా, ప్లాటినం 0.8 శాతం తగ్గి 980.67 డాలర్ల వద్ద ఉన్నాయి. 
 

ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్-బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్ లేదా గోల్డ్ ఇటిఎఫ్ ఎస్‌పిడిఆర్ గోల్డ్ ట్రస్ట్ హోల్డింగ్స్ బుధవారం 1,000.79 టన్నులకు గాను గురువారం 0.8 శాతం తగ్గి 992.65 టన్నులకు పడిపోయాయి. గోల్డ్ ఇటిఎఫ్‌లు బంగారం ధరపై ఆధారపడి ఉంటాయి. పసుపు లోహం ధరలో హెచ్చుతగ్గులపై దాని ధర కూడా హెచ్చుతగ్గులకు లోనవుతుంది. బంగారంపై బలహీన పెట్టుబడిదారుల ఆసక్తిని ఇటిఎఫ్ ప్రవాహాలు ప్రతిబింబిస్తాయని గమనించాలి. 
 

హైదరాబాద్‌లో ప్రస్తుతం 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,200 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,350 ఉంది. ముంబాయిలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 45,240 ఉంది. చెన్నైలో 22 క్యారెట్లు 10 గ్రాముల బంగారం ధర రూ. 43,570 ఉంది. వెండి ధర కూడా రూ.200 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.64,900కు పడిపోయింది. 

కాగా బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి పలు అంశాలు పసిడి ధర పై ప్రభావం చూపుతాయని గమనించాలి.

 బంగారం, వెండి ధరలకు వస్తు సేవల పన్ను జి‌ఎస్‌టి, ఇతర పన్నులు, తయారీ చార్జీలు వంటివి  రిటైల్ షాపుల్లో ధరలకు వ్యత్యాసం ఉండొచ్చు. అందువల్ల మీరు ఈ విషయాన్ని గమనించాలి.

click me!