జనవరి 1 నుంచి గ్యాస్ ధర నుండి డిజిటల్ పేమెంట్ వరకు ఈ రూల్స్ మారనున్నాయి.. అవేంటంటే ?

First Published Dec 28, 2021, 6:53 PM IST

దేశంలో ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి కొన్ని మార్పులు లేదా కొత్త నిబంధనలు(new rules) అమల్లోకి వస్తాయి.  కొత్త సంవత్సరం మొదటి తేదీ అంటే 1 జనవరి 2022 కొన్ని కొత్త నియమాలు, మార్పులు జరగనున్నాయి. ఈ నియమాలు, మార్పులు మీ వంటగది నుండి మీ పాకెట్ బడ్జెట్‌ వరకు  ప్రభావితం చేయవచ్చు. ఈ మార్పుల వల్ల సామాన్యుల నుంచి వ్యాపారుల వరకు ప్రభావితమవుతారు. 

కొత్త సంవత్సరంలో ఎల్‌పిజి ధర నుండి బ్యాంక్ ఎటిఎమ్, డెబిట్-క్రెడిట్ కార్డ్, అలాగే గూగుల్ అండ్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నిబంధనలలో మార్పులు చోటు చేసుకొనున్నాయి.. 

ఏ‌టి‌ఎం నుండి నగదు విత్‌డ్రా 
ప్రతినెల ఫ్రీ లిమిట్ ముగిసిన తర్వాత ఛార్జీలు వర్తిస్తుంది. ఇందుకు సంబంధించి ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా ఖాతాదారులకు సమాచారం ఇస్తోంది. బ్యాంక్ నోటీసు సమాచారంలో 1 జనవరి 2022 నుండి ఉచిత పరిమితితో పాటు ఏ‌టి‌ఎం లావాదేవీల చార్జ్ రూ. 20 + GST ​​నుండి రూ. 21 + GSTకి పెంచనుంది. అంటే ఇప్పుడు వినియోగదారులు గతంలో కంటే ఒక్క రూపాయి ఆధానంగా చెల్లించాల్సి ఉంటుంది. 

ఎఫ్‌ఎం‌సి‌జి ఉత్పత్తులు ఖరీదైనవి
కొత్త సంవత్సరం ద్రవ్యోల్బణంతో ప్రారంభం కానుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ నుండి ఆటో, స్టీల్ ధరలు పెరుగనున్నాయి. దీనితో పాటు ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (FMCG) ఉత్పత్తులు అండ్ లాజిస్టిక్స్ కోసం మీరు కొత్త సంవత్సరం నుంది ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. 
 

ధరల పెంపు
వచ్చే ఏడాది జనవరి 1 నుంచి బట్టలు, బూట్ల ధరలు  పెరగనున్నాయి. ఎందుకంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ (CBIC) వివిధ రకాల వస్త్రాలు, దుస్తులు ఇంకా పాదరక్షల వస్తువులు ఇంకా సేవల పన్ను రేటును 12 శాతానికి పెంచింది. గతంలో ఈ రేటు 5 శాతంగా ఉండేది. కొత్త జి‌ఎస్‌టి రేటు 1 జనవరి  2022 నుండి అమలులోకి వస్తుంది. అయితే కొన్ని సింథటిక్ ఫైబర్‌లు, నూలుపై జీఎస్టీ రేట్లను కూడా 18 శాతం నుంచి 12 శాతానికి తగ్గించారు.
 

ఆన్‌లైన్ ఆటో బుకింగ్ 
ఆన్‌లైన్‌లో ఆటో రిక్షా బుక్ చేసుకోని ప్రయాణించడం కూడా కొత్త సంవత్సరం నుండి ఖరీదైనదిగా మారనుంది. వాస్తవానికి జి‌ఎస్‌టి విధానంలో పన్ను రేటు ఇంకా పాలసీలో మార్పుల ప్రకారం, ఈ-కామర్స్ సర్వీస్ ప్రొవైడర్లు రవాణా అండ్ రెస్టారెంట్ రంగంలో అందించే సేవలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 

స్విగ్గీ ఇంకా జొమాటో వంటి ఇ-కామర్స్ కంపెనీలు కూడా ఆన్‌లైన్ ఫుడ్ పై 5% పన్నుకు  విధానపరమైన మార్పులలో భాగంగా తమ సేవలపై జి‌ఎస్‌టిని వసూలు చేస్తాయి. కంపెనీలు ఈ సేవలకు బదులుగా జీఎస్టీని వసూలు చేసి ప్రభుత్వానికి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. దీని కోసం వారు సర్వీసెస్ బిల్లును జారీ చేయాలి. ఇప్పటికే రెస్టారెంట్లు జీఎస్టీని వసూలు చేస్తున్నందున వినియోగదారులపై అదనపు భారం పడనుంది. 
 

అప్పీలుకు 25 శాతం జరిమానా  
కొత్త నిబంధన ప్రకారం, ఒక వ్యాపారవేత్త పన్ను అధికారుల  ఏదైనా నిర్ణయానికి  వ్యతిరేకంగా సవాలు చేయాలనుకుంటే, అతను ముందుగా విధించిన జరిమానాలో 25 శాతం చెల్లించాలి. ఉదాహరణకు, అక్రమ నిల్వ లేదా రవాణా నియమాలకు అనుగుణంగా లేని కారణంగా ఉత్పత్తిని స్వాధీనం చేసుకున్నట్లయితే ఇంకా పన్ను అధికారులు జరిమానా విధించినట్లయితే ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేయడానికి ముందు సంబంధిత డీలర్ పెనాల్టీ మొత్తంలో 25% చెల్లించాలి.   

తక్కువ పన్ను ఫైలింగ్ లేదా పన్ను ఫైలింగ్ చేయకుండా ఉండే ఆపరేషన్‌లో కూడా పెద్ద మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు ఇలా చేసిన వారిపై బ్యాంకు ఖాతాలు లేదా ఆస్తులను అటాచ్ చేయడానికి లాంగ్ నోటీసు ప్రక్రియ ఉంది, ఇప్పుడు దానిని రద్దు చేసింది. అంటే ఇప్పుడు నోటీసు లేకుండా ఆస్తిని అటాచ్ చేస్తారు. 

ఇ-వే బిల్లులో అప్పీల్ విధానం 
ఇ-వే బిల్లు ద్వారా వస్తువులను రవాణా చేయడంలో పొరపాటు ఉంటే ఇప్పుడు పన్ను నిబంధనను తొలగింపు ద్వారా జరిమానా నేరుగా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు పెనాల్టీకి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తే దానిలో 25 శాతం చెల్లించిన తర్వాత మాత్రమే ఉన్నత స్థాయిలో అప్పీల్ ఉంటుంది. ఇంతకు ముందు 10 శాతం చెల్లించాల్సి ఉండేది.

domestic LPG

ఎల్‌పి‌జి ధర 
ప్రతి నెల మొదటి తేదీన ఎల్‌పి‌జి  ధరలను నిర్ణయిస్తారు. ఇటీవలి నెలల్లో ఎల్‌పిజి ధరలు పెరిగాయి ఇంకా సబ్సిడీలు కూడా తగ్గాయి. 1 జనవరి 2022 కొత్త సంవత్సరం రోజున సిలిండర్ ధరలు పెరుగుతాయా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

డిజిటల్ చెల్లింపు నియమాలు
కొత్త సంవత్సరం నుండి ఆన్‌లైన్ చెల్లింపు చేస్తున్నప్పుడు మీరు చెల్లింపు చేసిన ప్రతిసారీ 16 అంకెల డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నంబర్‌తో సహా కార్డ్  పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. అంటే, ఇప్పుడు మీరు ఆన్‌లైన్ షాపింగ్ చేసినప్పుడల్లా లేదా షాపింగ్ చేసిన తర్వాత డిజిటల్ చెల్లింపు చేసినప్పుడల్లా మీరు ప్రతిసారీ కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. 

వెబ్‌సైట్ వివరాలను సేవ్ చేయదు
ఈ కొత్త మార్పు ప్రకారం మర్చెంట్ వెబ్‌సైట్, గూగుల్ పే లేదా ఇతర యాప్‌లు ఇకపై మీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ వివరాలను స్టోర్ చేయడం లేదా సేవ్ చేయడం సాధ్యం కాదు. అంతే కాకుండా కొత్త సిస్టమ్ కింద మీ కార్డ్‌కి సంబంధించిన ఏదైనా సమాచారం ఇప్పటికే వెబ్‌సైట్ లేదా యాప్‌లో సేవ్ చేయబడితే ఇప్పుడు స్వయంచాలకంగా తొలగించబడుతుంది.  

పోస్టాఫీసు నుండి డబ్బును ఉపసంహరణ
 మీరు పరిమితికి మించి నగదును విత్‌డ్రా చేసి డిపాజిట్ చేస్తే దానికి మీరు ఐ‌పి‌పి‌బికి ఛార్జీని చెల్లించాలి. ఈ నియమం 1 జనవరి 2022 నుండి అమలులోకి వస్తుంది. 

click me!