విద్యార్థుల ఖాతాలో కోట్ల రూపాయలు: పొరపాటున మీ ఖాతాలో డబ్బులు వస్తే ఏం చేయాలి ? ఆర్‌బి‌ఐ రూల్ ఏంటో తెలుసా?

First Published Sep 16, 2021, 8:25 PM IST

కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో దేశంలో చాలా మంది ప్రజలు డిజిటల్ లావాదేవీలుకు మొగ్గు చూపారు. దీంతో ఆన్‌లైన్ చెల్లింపుల ధోరణి దేశంలో చాలా వేగంగా పెరిగింది. చాలా మంది ప్రజలు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపేందుకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌నే ఆశ్రయిస్తున్నారు, ఎందుకంటే డిజిటల్ లావాదేవీలు మీ సమయాన్ని ఆదా చేస్తుంది. 

 డిజిటల్ లావాదేవీల కోసం ఆన్‌లైన్ మాధ్యమాన్ని సురక్షితంగా చేసేందుకు ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) పలు చర్యలు తీసుకుంది. అయితే ఇటీవల బీహార్‌లో ఇలాంటి కొన్ని కేసులు వెలుగు చూశాయి, ఇది అందరినీ ఆశ్చర్యపరిచింది.

బిహార్ రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొందరి బ్యాంకు ఖాతాలో డబ్బు వచ్చి చేరింది. ఇటీవల ఖగారియాలోని ఒక యువకుడి ఖాతాలోకి రూ .5.50 లక్షలు వచ్చాయి. ఇది కాకుండా ఇద్దరు స్కూల్ విద్యార్థుల బ్యాంకు ఖాతాలకు రూ .960 కోట్లు వచ్చాయి. ఈ మొత్తాన్ని చూసి బ్యాంక్ అధికారులకు కూడా ఏం అర్థం కాలేదు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ప్రజలు వారి బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకోవడానికి క్యూ కడుతున్నారు. 

మీ నుండి తప్పు ఖాతాకు డబ్బు బదిలీ అయితే మీరు ఏం చేయాలో తెలుసుకోండి ?

మీరు పొరపాటున మరొకరి ఖాతాకు డబ్బు బదిలీ చేసినట్లయితే డబ్బు తిరిగి పొందడానికి మీరు చేయవలసిన మొదటి పని ఏటీఎం కార్డ్ నంబర్ అండ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీస్‌ని స్విచ్ ఆఫ్ చేయడం. దీని వల్ల డబ్బు బదిలీ జరగకుండా ఉంటుంది. ఆ తర్వాత ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయండి. అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీని బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది.
 

పొరపాటున బదిలీ చేసిన డబ్బుపై బ్యాంక్ దర్యాప్తు

ఎఫ్‌ఐ‌ఆర్ కింద పొరపాటున బదిలీ చేసిన డబ్బుపై బ్యాంక్ దర్యాప్తు చేస్తుంది. మీ డబ్బు పొరపాటున ఇతర ఖాతాకు బదిలీ అయ్యిందా లేదా ఎవరైనా డబ్బును పొందేందుకు మోసానికి పాల్పడ్డార  అని మీరు అందించిన సమాచారాన్ని బ్యాంక్ తనిఖీ చేస్తుంది. ఒకవేళ మీకు ఏదైనా మోసం జరిగి ఉంటే మీరు పూర్తి డబ్బును తిరిగి పొందుతారు. కానీ మీరు పొరపాటున వేరొకరి అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేసినట్లయితే, ముందుగా చేయాల్సిన పని ఏమిటంటే, మీరు వేరొకరి అకౌంట్‌కు డబ్బు బదిలీ జరిగిందా లేదా తెలుసుకోవడానికి మీ బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది. దీని తరువాత ఎవరి ఖాతాకు తప్పుగా డబ్బు బదిలీ అయ్యిందో ఆ బ్యాంకుని సంప్రదించండి.

ఆర్‌బి‌ఐ నియమం ఏమిటి?

మీరు పొరపాటున డబ్బు బదిలీ చేసినట్లు రుజువు అయితే మీరు మీ డబ్బును తిరిగి పొందవచ్చు. దీని కోసం ముందుగా మీరు చేయవలసిన పని ఏమిటంటే దీని గురించి బ్యాంకుకు తెలియజేయడం అలాగే పూర్తి సమాచారం ఇవ్వలీ. రిజర్వ్ బ్యాంక్ ప్రకారం మీ అనుమతి లేకుండా డబ్బు బదిలీ అయితే మీరు దీనిని మూడు రోజుల్లోగా బ్యాంకుకు నివేదించాలి. ఒకవేళ ఎవరైనా మీ బ్యాంక్ ఖాతా నుండి డబ్బును బదిలీ చేస్తే మూడు రోజుల్లోపు మీరు బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి అప్పుడు మీరు ఈ నష్టాన్ని భరించాల్సిన అవసరం లేదు. మీ ఖాతా నుండి ఉపసంహరించుకున్న మొత్తం 10 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాకు తిరిగి వస్తుంది. ఏదైనా అనధికార లావాదేవీ తర్వాత కూడా మీరు మీ పూర్తి డబ్బును తిరిగి పొందవచ్చని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెబుతోంది. దీని కోసం అప్రమత్తత అవసరం. 

డబ్బు తిరిగి ఇవ్వకపోతే ఏమవుతుంది?

పొరపాటున మీ ఖాతాలో డబ్బు జమ అయినట్లు తేలితే మీరు ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే మీపై చర్యలు తీసుకోబడతాయి. ఫలితంగా మిమ్మలి  అరెస్టు చేయవచ్చు. ఇటీవల బీహార్‌లో ఇలాంటి కేసు తెరపైకి వచ్చింది. ఒక వ్యక్తి ఐదున్నర లక్షల రూపాయలు తిరిగి ఇవ్వడానికి నిరాకరించడంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ  సంఘటణ ఖగారియా జిల్లాలోని భక్తియార్‌పూర్ గ్రామంలో రంజిత్ దాస్ అనే వ్యక్తి ఖాతాలో ఐదున్నర లక్షల రూపాయలు అకస్మాత్తుగా వచ్చాయి అతను ఈ డబ్బును బ్యాంకు నుండి ఉపసంహరించుకున్నాడు. దీని తరువాత బ్యాంక్ తప్పును గ్రహించి వారి నుండి డబ్బును తిరిగి ఇవ్వాలని కోరింది కానీ అతను దానిని తిరస్కరించాడు. బ్యాంకు పదేపదే నోటీసులు పంపినప్పటికీ రంజిత్ డబ్బును తిరిగి ఇవ్వకపోవడంతో  అతని అరెస్టు చేశారు.
 

ఒకవేళ బ్యాంక్ మీ సమస్యను వినకపోతే మీరు ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చు.

బ్యాంక్  ఫిర్యాదు పరిష్కార ప్రక్రియపై కస్టమర్ అసంతృప్తిగా ఉన్నట్లయితే వారు బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ స్కీమ్ అంటే బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ (BO) ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. బ్యాంకింగ్ సేవల్లో లోపాలకు సంబంధించి కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అధికారిని నియమించింది. ఈ పథకం 1 జనవరి 2006 నుండి వర్తిస్తుంది. మీరు https://bankingombudsman.rbi.org.in ని సందర్శించడం ద్వారా మీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయవచ్చు. ఈ లింక్‌ని సందర్శించిన తర్వాత మీరు 'బ్యాంకింగ్ అంబుడ్స్‌మన్ అడ్రస్' పై క్లిక్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

click me!