పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఆ పార్టీ అధినేత వై.ఎస్. షర్మిల గురువారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైల్లో ఉన్న సమయంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ కోసం వై.ఎస్. షర్మిల పాదయాత్ర నిర్వహించారు. వైఎస్ఆర్‌సీపీ, వైఎస్ఆర్‌టీపీ నుండి కాంగ్రెస్ పార్టీ వరకు వై.ఎస్. షర్మిల రాజకీయ ప్రస్థానంలో అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి.
also read:కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్. షర్మిల: లోటస్ పాండ్‌లో విజయమ్మతో జగన్ భేటీ
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో కీలక నేత. 2004, 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు రావడంలో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డిది కీలక పాత్ర. 2009 సెప్టెంబర్ 2వ తేదీన వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి నల్లమల అడవిలో హెలికాప్టర్ కూలిపోవడంతో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మృతి చెందారు.
also read:కేసీఆర్‌కు జగన్ పరామర్శ: లంచ్ భేటీ
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి మృతితో మరణించిన కుటుంబాలకు పరామర్శించేందుకు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అయితే ఈ ఓదార్పు యాత్రకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఓదార్పు యాత్రకు అనుమతిని ఇవ్వలేదు.
also read:వైఎస్ఆర్‌టీపీ విలీనం: కాంగ్రెస్‌లో చేరిన వై.ఎస్. షర్మిల
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీరుపై వై.ఎస్. జగన్ అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం అప్పట్లో సాగింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2011 మార్చి 12న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)ని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా లభించిన ఎంపీ పదవికి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి వై.ఎస్. విజయమ్మ రాజీనామాలు చేశారు. ఈ రెండు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో వీరిద్దరూ ఘన విజయం సాధించారు.
also read:కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనం: రాజ్యసభకు వై.ఎస్. షర్మిల
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
2012 మే 27న వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో అరెస్టైన వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి 2013 సెప్టెంబర్ 24 న చంచల్‌గూడ జైలు నుండి విడుదలయ్యారు.
also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి చంచల్ గూడ జైలులో ఉన్న సమయంలో వై.ఎస్. షర్మిల ప్రత్యక్ష రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2012 అక్టోబర్ 2న 'వస్తున్నా మీ కోసం' పేరుతో పాదయాత్రను నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ప్రారంభించారు. అయితే అదే సమయంలో వైఎస్ఆర్‌సీపీ అధినేత వై.ఎస్. జగన్ ఆదేశాల మేరకు వై.ఎస్. షర్మిల పాదయాత్రను ప్రారంభించారు.
also read:ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
2012 అక్టోబర్ 18న కడప జిల్లాలోని ఇడుపులపాయ నుండి వై.ఎస్. షర్మిల పాదయాత్రను ప్రారంభించారు. మూడు వేల కి.మీ. పాదయాత్ర నిర్వహించారు వై.ఎస్. షర్మిల. 2013 ఆగస్టు 4న పాదయాత్ర ముగించారు వై.ఎస్. షర్మిల. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అంశంపై వైఎస్ఆర్‌సీపీ ఆందోళనలు నిర్వహించింది.
also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడ పాదయాత్ర నిర్వహించారు. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, వై.ఎస్. షర్మిల మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం సాగుతుంది. 2011 నుండి 2021 వరకు వైఎస్ఆర్‌సీపీతో వై.ఎస్. షర్మిల అనుబంధం కొనసాగింది.
also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వై.ఎస్. షర్మిల తన రాజకీయ కార్యక్షేత్రాన్ని తెలంగాణకు మార్చుకున్నారు.2021 జూలై 8న యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ ( వైఎస్ఆర్‌టీపీ)ని ఏర్పాటు చేశారు వై.ఎస్. షర్మిల. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ విధానాలపై ఆమె ఘాటుగానే విమర్శలు చేశారు.
also read:కొత్త టీమ్ కోసం కిషన్ రెడ్డి కసరత్తు: 15 జిల్లాల అధ్యక్షుల మార్పు
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
వైఎస్ఆర్‌టీపీని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణలో వై.ఎస్. షర్మిల పాదయాత్ర చేశారు. 3800 కి.మీ. సుదీర్ఘ పాదయాత్ర నిర్వహించి గిన్నిస్ రికార్డు సాధించారు.2021 అక్టోబర్ 20న లో చేవేళ్ల నుండి షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. ఏడాదిన్నర పాటు పాదయాత్ర చేశారు.ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రను ముగించారు షర్మిల.
also read:గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా ఇదీ
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
అయితే తెలంగాణ రాజకీయాల్లోపరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలని వై.ఎస్. షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది నవంబర్ మాసంలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలకు ముందే వై.ఎస్. షర్మిల తన పార్టీ వైఎస్ఆర్‌టీపీని విలీనం చేయాలని భావించారు.
also read:జగన్ కు చంద్రబాబు దెబ్బ: 90 స్థానాల్లో అభ్యర్థుల ఖరారు
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డితో పాటు కొందరు తెలంగాణకు చెందిన నేతలు వై.ఎస్. షర్మిల సేవలను తెలంగాణలో వినియోగించుకోవడంపై అభ్యంతరం తెలిపారు. దీంతో వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరిక వాయిదా పడింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని తొలుత వై.ఎస్. షర్మిల నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు. కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వై.ఎస్. షర్మిల చెప్పారు.
also read:బీజేపీ తేల్చాకే: సీట్ల సర్ధుబాటుపై టీడీపీ, జనసేన ప్రకటన
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 15 శాతం ఓట్లు రాబట్టుకొనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే వై.ఎస్. షర్మిలను ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్‌టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంది.
also read:టీడీపీతో పొత్తుపై సంక్రాంతికి విడుదల: మోడీకి నివేదిక
పాదయాత్రలతో రికార్డ్: వైఎస్ఆర్‌సీపీ నుండి కాంగ్రెస్ వరకు షర్మిల ప్రస్థానమిదీ..
కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వై.ఎస్. షర్మిలకు బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణలో ప్రచార బాధ్యతలు ఇస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడ ఆ బాధ్యతలను నెరవేరుస్తానని వై.ఎస్. షర్మిల ప్రకటించారు.
also read:బీసీలపై తెలుగు దేశం ఫోకస్: జయహో బీసీకి శ్రీకారం, జగన్ కు చెక్ పెట్టేనా?