బీసీలపై తెలుగు దేశం ఫోకస్: జయహో బీసీకి శ్రీకారం, జగన్ ‌కు చెక్ పెట్టేనా?

బీసీ సామాజిక వర్గంపై  తెలుగు దేశం పార్టీ ఫోకస్ పెట్టింది. బీసీల రక్షణ కోసం  ప్రత్యేకంగా ఓ చట్టం తీసుకు రావాలని ఆ పార్టీ భావిస్తుంది.

Telugu desam Party To start Jahayo BC From January 4, 2024 lns


అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బీసీలపై ఫోకస్ పెట్టింది.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  గత ఎన్నికల సమయంలో  బీసీలపై యువజన శ్రామిక  రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)  కేంద్రీకరించింది.  అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ సామాజిక న్యాయానికి వైఎస్ఆర్‌సీపీ  ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో  తెలుగుదేశం పార్టీ  బీసీలపై ఫోకస్ పెట్టింది.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి బీసీలు  ఆ పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగు దేశం పార్టీలో  బీసీ సామాజిక వర్గానికి చెందిన  నేతలు  రాజకీయాల్లో రాణించడానికి  తెలుగు దేశం పార్టీ  ఒక వేదికగా నిలిచిందనే అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు.  తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం సమయంలో  కొత్త తరానికి  ఆ పార్టీ అవకాశం కల్పించింది.  మరోవైపు బీసీ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ  వెన్నుదన్నుగా నిలిచింది.  దీంతో ఆ పార్టీని బీసీ సామాజిక వర్గం అంటిపెట్టుకున్నారు.

also read:ఆయేషా మీరా హత్యకు నేటికి 16 ఏళ్లు: ఎన్నో మలుపులు, తేలని దోషులు

 అయితే  వైఎస్ఆర్‌సీపీ  బీసీ సామాజిక వర్గంపై ఫోకస్ ను పెంచింది.  తెలుగు దేశం పార్టీ  బీసీ సామాజిక వర్గాన్ని  ఓటు బ్యాంకుగానే ఉపయోగించుకుందని  వైఎస్ఆర్‌సీపీ విమర్శలు చేస్తుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు  అధిక ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించింది.  

also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి  ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయనుందో  తెలుగు దేశం పార్టీ  ప్రచారం చేయనుంది. 2024 జనవరి 4 వ తేదీ నుండి జయహో బీసీ అనే కార్యక్రమాన్ని చేపట్టాలని  తెలుగు దేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. 

also read:జగనన్న వదిలిన బాణం: కాంగ్రెస్‌ చేతికి అస్త్రం కానుందా?

బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేయాలని  ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. క్షేత్ర స్థాయిలో పర్యటించి  బీసీల సమస్యలను తెలుసుకోవాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది.   బీసీల రక్షణ చట్టం తెస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.  బీసీలకు శాశ్వత  కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని  తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో బీసీ సామాజిక వర్గానికి ఏం చేశాం,వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయంలో బీసీలకు  ఏం చేశారనే విషయాలను కూడ  వివరించనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios