కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి వై.ఎస్. షర్మిల రంగ ప్రవేశం చేస్తే ఏ పార్టీకి ఎంత నష్టమనే చర్చ ప్రస్తుతం సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో ఎన్నికలు జరగనున్నాయి.
also read:వైఎస్ఆర్‌టీపీ కీలక సమావేశం: కాంగ్రెస్‌లో విలీనంపై ప్రకటనకు ఛాన్స్
కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?
యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అధినేత వై.ఎస్. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోనే ప్రక్రియ ఈ మాసంలో జరిగే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ 15 శాతం ఓట్ల శాతం లక్ష్యంతో ముందుకు వెళ్తుంది.
also read:ఆంధ్రప్రదేశ్‌లో వంద రోజుల ప్లాన్: కాంగ్రెస్ వ్యూహమిదీ...
కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?
వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తే దాని ప్రభావం ఏ పార్టీపై ఎక్కువగా ఉంటుందనే చర్చ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు.
also read:పవన్ కళ్యాణ్ పై ముద్రగడ పోటీ: వై.ఎస్. జగన్ స్కెచ్ ఇదీ..
కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సుమారు 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని జగన్ భావిస్తున్నారు. ఈ మేరకు కసరత్తు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్‌సీపీలో టిక్కెట్లు దక్కని వారితో పాటు అసంతృప్తులు వై.ఎస్. షర్మిల వైపు చూసే అవకాశం ఉంది. వై.ఎస్. షర్మిలతోనే తన ప్రయానం ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.అయితే వైఎస్ఆర్‌టీపీ ఓట్లను వై.ఎస్. షర్మిల చీల్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
also read:ఆపరేషన్ కాపు: ముద్రగడ, వంగవీటి రాధాలకు జగన్ గాలం
కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే పరోక్షంగా అధికారంలో ఉన్న వైఎస్ఆర్‌సీపీకి ప్రయోజనం కలుగుతుంది. వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ పుంజుకొంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే దాని ప్రభావం తెలుగు దేశం పార్టీపై కూడ లేకపోలేదు. అదే జరిగితే తెలుగు దేశం పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది.
also read:కొత్త టీమ్ కోసం కిషన్ రెడ్డి కసరత్తు: 15 జిల్లాల అధ్యక్షుల మార్పు
కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?
ప్రభుత్వ వ్యతిరేక ఓటును వై.ఎస్. షర్మిల చీల్చితే దాని ప్రభావం పరోక్షంగా తెలుగు దేశంపై చూపనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నాలు పరోక్షంగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి కలిసొచ్చే అవకాశం కూడ లేకపోలేదనే అభిప్రాయాలను కూడ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
also read:గెలుపు గుర్రాలకే టిక్కెట్లు: వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థుల జాబితా ఇదీ
కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల: తెలుగు దేశానికి దెబ్బేనా?
వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే వైఎస్ఆర్‌సీపీ నుండి ఎందరు షర్మిల వెంట నడుస్తారనే విషయమై అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో తెలుగు దేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
also read:కాంగ్రెస్‌లోకి వై.ఎస్. షర్మిల?: వై.ఎస్. విజయమ్మ ఎటువైపు