లిల్లీ పూల సాగులో ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు ఇవే!

First Published Feb 26, 2022, 12:56 PM IST

లిల్లీ (Lily) పరిమళాలు వెదజల్లే అందమైన మొక్క. సాధారణంగా లిల్లీ పువ్వులను సంపంగి పూలు అని కూడా పిలుస్తారు.
 

 లిల్లీ అనేది లిలియేసి (Liliaceae) కుటుంబానికి చెందినది. లిల్లీ పువ్వు సాగులో వివిధ దశల్లో ఆశించే పురుగుల ఉదృతి కారణంగా రైతులు అధికంగా నష్టపోతున్నారు. వాటి నివారణ చర్యలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
 

లిల్లీ, ఉల్లి (Onion) మాదిరిగా భూమిలో దుంప కలిగిన జాతి. సమశీతోష్ణ స్థితి కలిగిన వాతావరణ పరిస్థితుల్లో లిల్లీ పువ్వులు చక్కగా పెరిగి అధిక దిగుబడులను ఇస్తాయి. లిల్లీ పువ్వులకు వెలుతురు బాగా ఉండి 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత (Temperature) ఉన్న ప్రదేశాలు అనుకూలమైనవి. 
 

Latest Videos


40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే పూల నాణ్యత బాగా తగ్గుతుంది. అత్యల్ప ఉష్ణోగ్రత గల నేలలు, మంచుపడే ప్రదేశాలు (Snowy places) లిల్లీ పూల సాగుకు అసలు పనికిరావు. తేలికపాటి ఇసుక నేలలు, ఒండ్రు నేలలు (Alluvial soils), ఎర్ర గరప నేలలు లిల్లీ పువ్వుల సాగుకు అనుకూలంగా ఉంటాయి.
 

వాతావరణంలో తడి అధికంగా ఉన్నప్పుడు నీరు నిలిచే నేలలో లిల్లీ పంట సాగుకు అనుకూలంగా ఉండదు. సంవత్సరం పొడవునా ఆదాయాన్ని అందించే లిల్లీ పూల సాగు జూలై ఆగస్టు నెలలో నాటేందుకు అనువుగా ఉంటుంది. లిల్లీ పూలలో సింగిల్ (Single), డబుల్ (Double), సెమిడబుల్, వెరిగేటెడ్ అనే రకాలు బాగా ప్రాచుర్యం పొందినవి. 
 

మొగ్గ తొలుచు పురుగు: పూత దశలో మొగ్గ తొలిచే పురుగు రంధ్రాలు చేయడంతో పూమొగ్గలు పనికి రాకుండా పోతాయి. ఈ పురుగు నివారణకు గాను క్వినాల్ఫాస్ (Quinalphos) 2 మి.లీ. లేదా థయోడికార్బ్ (Thiodicarb) 1 గ్రా. చొప్పున లీటరు నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే సరిపోతుంది.
 

కాండం కుళ్ళు తెగులు: వాతావరణంలో తడి అధికంగా ఉన్నప్పుడు, నీరు నిలిచే నేలలో కాండం కుళ్ళు తెగులు (Stem rot) లిల్లీ మొక్కలను ఆశిస్తాయి. వీటి నివారణకు గాను లీటరు నీటికి 5 గ్రాముల కార్బండిజమ్ (Carbonism) కలిపి పిచికారి చేసుకోవాలి.
 

తామర పురుగు: లిల్లీ పంటకు తామర పురుగులు సోకితే పూమొగ్గలు  సరిగా విడిపడక వాడి రాలిపోతాయి. వీటి నివారణకు లీటరు నీటికి డైమిథోయేట్ (Dimethoate) 2 మి.లీ. గానీ లేదా ఫిప్రోనిల్ (Fipronil) 2.0 మి.లీ. గానీ కలిపి పిచికారి చేయాలి.
 

ఎర్ర నల్లి: సాలెపురుగు జాతికి చెందిన ఎర్ర నల్లి  ఆకుల అడుగుభాగాన చేరి రసాన్ని పీల్చేసి మొక్కలను బలహీనపరుస్తుంది. పొడి వాతావరణం ఉన్న సమయంలో ఈ తెగులు ముక్కలను అధికంగా ఆశిస్తాయి. వీటి నివారణకు లీటరు నీటికి డైమీథోఎట్ (Dimethoate) 2 మిల్లీలీటర్లు గాని లేదా ఫిప్రోనిల్ (Fipronil) 2.0 మిల్లీ లీటర్లు లీటరు నీటికి కలిపి  పిచికారీ చేయాలి.

click me!