ఇక నిఖిల్ కూడా యష్మితో కరెక్ట్ గా ఉండటంలేదు. ఈ విషయంలో ప్రేరణతో యష్మి మాట్లాడింది. అతను చాలా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మాట్లాడుతాడు.. కాని బయటపడడు. కేమెరా ముందు మంచోడు అనిపించుకోవాలి అనుకుంటే ఉండు కాని నేను మాత్రం ఫేక్ గా ఉండలేను. నేను గౌతమ్ డాన్స్ చేస్తుంటే జలస్ ఫీల్ అయ్యాడట.. అంటే అవును అన్నది ప్రేరణ. నిఖిల్ చేసే పనులు చూస్తుంటే అది లవ్ లాగ్వేజ్ లాగే ఉంది అంటూ క్లియర్ గా చెప్పేసింది.
కాని ఇటు యష్మి ఎంత ట్రై చేస్తున్నా.. నిఖిల్ మాత్రం ఓపెన్ అవ్వడంలేదు. ఇక టాస్క్ ల విషయంలో టేస్టీ తేజ్ నోరు పెంచి బెదిరించడంతో అది కాస్త గొడవగామారింది. ఇక ఎలాగోల ఆరుగురు చీఫ్ కంటెండర్ రేస్ లోకి వచ్చారు. అందులో ప్రేరణ, విష్ణు ప్రియ, నిఖిల్, పృధ్వీ, తేజ, రోహిణి ఉన్నారు. ఎన్నుకునే బాధ్యత టాస్క్ రూపంలో హౌస్ లోఉన్నవారి చేతుల్లోనే పెట్టాడు బిగ్ బాస్.
Also Read: హైదరాబాద్ లో టబు ఆస్తులు ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు,