జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేసిన అల్లు అర్జున్, ఆ స్టేట్ లో ఐకాన్ స్టార్ దే హవా

First Published | Oct 25, 2024, 11:01 PM IST

ఎంత మంది వచ్చినా.. అది నా అడ్డా అంటున్నాడు అల్లు అర్జున్.. అక్కడ పాగా వేయాలి అని చూసిన జూనియర్ ఎన్టీఆర్ ను కూడా తొక్కేశాడట. ఇంతకీ ఎక్కడా..? ఏంటి సంగతి. 

టాలీవుడ్ లో తమ్ముడు  తమ్ముడే.. పేకాట పేకాటే అన్న సామెత నడుస్తుంది. ఎవరు ఎంత బంధుత్వాలు ఉన్నా.. ఎంత స్నేహం ఉన్నా.. సినిమాల విషయంలో మాత్రం పోటీ తప్పదు. బాగా క్లోజ్ అనుకున్నవారు కూడా సినిమాల విషయంలో వెనక్కి తగ్గేదేలే అంటుంటారు. ఈక్రమంలో అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇదే జరిగిం

Also Read: CID 2 వచ్చేస్తోంది, బుల్లితెర ఆడియన్స్ కు ఇక పండగే.

బన్నీతో ఎంతో ప్రేమగా.. ఆప్యాయతగా ఉండే ఎన్టీఆర్.. ఓ ప్రాంతంలో మాత్రం అల్లు అర్జున్ వల్ల దెబ్బతినక తప్పలేదట. ఇంతకీ విషయం ఏంటి..? ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలాక్లోజ్ గా ఉండేవారిలో బన్నీ, తారక్ కూడా ఉన్నారు. ఇద్దరు భావ భావ అని పిలుచుకుంటారు. ఏ అకేషన్ అయినా.. విష్ చేసుకుంటారు. వీరి ప్రేమ.. ఫ్రెండ్షిప్ చూసి.. ఇద్దరు స్టార్ హీరోల  ఫ్యాన్స్ కూడా తెగ మురిసిపోతుంటారు. 

Also Read:ఐశ్వర్య రాయ్ కి జిరాక్స్ కాపీలా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ?


అయితే సినిమాల విషయానికి వస్తే మాత్ర పోటా పోటీ నడుస్తూనే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో సంచలనం సృష్టించాడు పాన్ ఇండియా రేంజ్ లో కూడా మంచి కలెక్షన్లు సాధించి అద్భుతం చేశాడు. కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా అటు హిందీలో.. ఇటు సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లలో దూసుకుపోయింది. 

ఈసినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ పెరిగిపోయింది. కొరటాల శివకు ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా కొత్త ఇమేజ్ వచ్చింది. అయితే ఈసినిమా రైట్స్ విషయంలో ఎన్టీఆర్ కు కేరళలోపెద్దగా స్పందన రాలేదని తెలుస్తోంది. కేరళలో దేవర సినిమా రేట్స్ కేవలం 2 కోట్లకు మాత్రమే అమ్ముడు పోయాయట. 

Also Read:సుకుమార్ సెంటిమెంట్, పుష్ప2 కూడా ఆయనకు చూపించాడట.

Devara, Allu Arjun,Sukumar, Rashmika Mandanna, Pushpa 2

అయితే ఈ విషయంలో రిలీజ్ అవ్వకముందే అల్లు అర్జున్ పుష్ప సినిమా దేవరకు దెబ్బేసిందని ఆడియన్స్ అభిప్రాయం ఎందుకంటే అల్లు అర్జున్  పుష్ప2 సినిమా రైట్స్ కేరళలో 20 కోట్ల వరకూ అమ్ముడుపోయాయట. దాంతో ఎవరు ఎంత పాగావేయాలి అని చూసినా.. కేరళ సినిమా అల్లు అర్జును అడ్దా అని మరో సారి నిరూపితం అయ్యింది అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. 

Also Read:హైదరాబాద్ లో టబు ఆస్తులు ఎన్నో తెలిస్తే షాక్ అవుతారు, అన్ని కోట్లు ఎలా వచ్చాయో తెలుసా..?

అల్లు అర్జున్ కు మొదటి నుంచి కేరళలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ మమ్ముట్టి, మోహన్ లాల్ తరువాత అల్లు అర్జున్ కు భారీగా కటౌట్లు పెడతారు.అంతే కాదు వారు బన్నీని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. తెలుగులో కాస్త అటు ఇటు అయినసినిమాలు కూడా కేరళలో అభ్భుతంగా ఆడిన సందర్భాలు ఉన్నాయి. 

అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సాధించాడు. పుష్ప సినిమాతో నార్త్ లో ఉత్తరప్రదేశ్, లాంటి రాష్ట్రాల్లో కూడా అల్లు అర్జున్ అంటే పడిచచ్చిపోతున్నారు అభిమానులు. ఇక పుష్ప2 కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అటువంటిది కేరళలో పుష్ప 2 అంచనాలు ఏ విధంగా ఉంటాయో చెప్పనక్కర్లేదు. 

ఇక ఈసారి ఈసినిమాతో 1000కోట్లు దాటేలా టార్గెట్ చేసుకుని పనిచేస్తున్నారు. దేవర సినిమా టోటల్ గా 500 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక పుష్ప 1000 కోట్లు అలవోకగా దాటుతుందని అంచనాలు వేస్తున్నారు. ఈరకంగా కేరళలో ఎన్టీఆర్ ను పక్కకు పెట్టారని.. బన్నీ ఇమేజ్ ను బయట హీరోలెవరు అక్కడ అందుకోవడం కష్టమని అంటున్నారు ఫ్యాన్స్. మరి చూడాలి పుష్ప2 అనుకున్నది సాధిస్తుందా లేదా అనేది. 

Latest Videos

click me!