కన్యత్వం నిధి కాదు.. భర్తకి గిఫ్ట్ ఇవ్వడానికి: నటి కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Jan 2, 2019, 10:48 AM IST
Highlights

కన్యత్వమనేది నిధి కాదని అంటోంది బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్. పెళ్లి అయ్యేంతవరకు కన్యగా ఉండి, భర్తకు మాత్రమే అంకితం చేయడానికి వర్జినిటీ అనేది నిధి కాదని బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ. 

కన్యత్వమనేది నిధి కాదని అంటోంది బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్. పెళ్లి అయ్యేంతవరకు కన్యగా ఉండి, భర్తకు మాత్రమే అంకితం చేయడానికి వర్జినిటీ అనేది నిధి కాదని బోల్డ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ని పెళ్లి చేసుకున్న ఈమె కొంతకాలం తరువాత అతడి నుండి విడాకులు తీసుకుంది. మీటూ ఉద్యమం సాగుతున్న నేపధ్యంలో సెక్స్ ప్రస్తావన రావడంతో.. ఆడవాళ్లకు సెక్స్ విషయంలో నో అనే హక్కు ఎంత ఉంటుందో.. 'ఎస్' అని చెప్పే హక్కు కూడా ఉంటుందని అంటోంది కల్కి.

పెళ్లయ్యే వరకు సెక్స్ కి దూరంగా ఉండాలని అనడం ఏంటని ప్రశ్నిస్తోంది. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయమని చెబుతోంది. ఎంతైనా ఈమె ఫ్రెంచ్ దేశానికి చెందినది కాబట్టి ఈ రకమైన కామెంట్స్ చేయడంతో తప్పు లేదు.

అక్కడ కల్చర్ తో పోలిస్తే ఇక్కడ వారికి ఆమె చెబుతోన్న మాటలు ఆశ్చర్యంగానే ఉంటాయి మరి. తల్లితండ్రులు పిల్లలతో సెక్స్ గురించి చర్చిచే వాతావరణం రావాలని వెల్లడించింది. 
 

click me!