రౌడీ హీరో విజయ్ తో సుకుమార్ క్రేజీ ప్రాజెక్ట్

By Satish ReddyFirst Published Sep 28, 2020, 12:14 PM IST
Highlights

స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో మూవీ కన్ఫర్మ్ చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఫాల్కన్ పరిశ్రమల అధినేత కేధార్ సెలగంశెట్టి నిర్మాణంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ రూపొందనుంది. నిర్మాత కేధార్ తన పుట్టినరోజు పురస్కరించుకొని ఈ ప్రకటన చేశారు. 
 

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఖాతాలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో ఆయన ఓ మూవీ చేయనున్నాడు. ఈ చిత్రంతో  కేదార్ సెలగంశెట్టి అనే యువ నిర్మాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టనున్నారు. ఫాల్కన్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమాల మీద ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చిన కేదార్ భవిష్యత్ లో వరుసగా సినిమాలు చేయబోతున్నారు.అందులో భాగంగా తన మొదటి సినిమాను హీరో విజయ్ దేవరకొండ, స్టార్ డైరెక్టర్ సుకుమార్ లతో చేయబోతున్నట్టు తన పుట్టిన రోజు సందర్భంగా అనౌన్స్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  "ఈ పుట్టిన రోజు నాకు చాలా స్పెషల్.నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తులు విజయ్ దేవరకొండ, సుకుమార్ గార్ల తో నా మొదటి సినిమా అనౌన్స్ చేస్తున్నందుకు చాలా సంతోషం గా ఉంది. ఈ సినిమా 2022 లో మొదలు కాబోతుంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా ఉండబోతుంది.ఈ కాంబినేషన్ అనగానే అందరికి చాలా అంచనాలుంటాయి.విజయ్ ,సుకుమార్ లిద్దరూ కొత్తదనాన్ని బాగా ఇష్టపడతారు. వాళ్ళ సినిమాలు కుడా అలాగే ఉంటాయి.వాళ్ళిద్దరి కలయిక లో వస్తున్న ఈ సినిమా కూడా వాళ్ళ స్టైల్ లోనే ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి మిగతా వివరాలు తర్వాత తెలియజేస్తాం." అని అన్నారు.

ఈ ప్రాజెక్ట్ తో విజయ్ ఇమేజ్ మరో స్థాయికి చేరడం ఖాయం అని చెప్పాలి. సుకుమార్ లాంటి దర్శకుడితో పనిచేసే అవకాశం రావడం అంటే ఓ భారీ హిట్ ఖాతాలో వేసుకున్నట్లే. ప్రస్తుతం సుకుమార్ హీరో అల్లు అర్జున్ తో పుష్ప మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ త్వరలో మొదలుకానుంది. ఇది పాన్ ఇండియా మూవీగా విడుదల కానుంది. విజయ్ దేవరకొండ దర్శకుడు పూరితో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. స్పోర్ట్స్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతుండగా విజయ్ ఫైటర్ గా కనిపించనున్నాడు. 
 

Sukumar - Vijay Deverakonda

The actor in me is super excited
The audience in me is celebrating!
We guarantee you memorable Cinema.. I can't wait to be on set with Sukku sirrr 😘🤗

Happy birthday Kedar, you've been a good friend and you work extremely hard :) pic.twitter.com/9CHIIvcpBw

— Vijay Deverakonda (@TheDeverakonda)
click me!