తొక్కుకుంటూ వెళ్లే నేచర్, 'అరవింద సమేత' కథ నాదే: వేంపల్లి గంగాధర్

By Udayavani DhuliFirst Published Oct 19, 2018, 4:19 PM IST
Highlights

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమాకి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు త్రివిక్రమ్. ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే 'అరవింద సమేత' కథ తనదేనంటూ ప్రముఖ రచయిత వేంపల్లి గంగాధర్ సోషల్ మీడియాలో ఆధారాలతో సహా ఓ పోస్ట్ పెట్టారు. 

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అరవింద సమేత' సినిమాకి దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు త్రివిక్రమ్. ఈ సినిమా విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే 'అరవింద సమేత' కథ తనదేనంటూ ప్రముఖ రచయిత వేంపల్లి గంగాధర్ సోషల్ మీడియాలో ఆధారాలతో సహా ఓ పోస్ట్ పెట్టారు. దీంతో విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయింది.

త్రివిక్రమ్ తన కథని కాపీ కొట్టారని గంగాధర్ వివరంగా చెప్పడం, అలాగే త్రివిక్రమ్ తనతో మాట్లాడారని ఆయనతో కొన్ని రోజులు ఉన్నానని పేర్కొనడం అనుమానాలకి దారి తీసింది. అయితే ఈ విషయంలో పూర్తి క్లారిటీ కోసం రచయిత వేంపల్లి గంగాధర్ ని ఏషియానెట్ టీమ్ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయగా ఆయన స్పందించారు. ఈ క్రమంలో ఎన్నో విషయాలను పంచుకున్నారు. ''రచయితగా నాకు చాలా పనులు ఉంటాయి. 

నేను కొన్ని నవలలను పూర్తి చేసే పనిలో ఉన్నప్పుడు త్రివిక్రమ్ గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఆయనే స్వయంగా హైదరాబాద్ కి టికెట్లు పంపించి అక్కడకి చేరుకున్న తరువాత కారు కూడా ఏర్పాటు చేసి నాకొక హోటల్ లో బస ఏర్పాటు చేశారు. నాతో మాట్లాడి నా కథల గురించి తెలుసుకొని ఒక్కొక్కటిగా నోట్ చేసుకోవడం గమనించి బాగా అనిపించింది. కొన్ని రోజులు వారితో ట్రావెల్ చేసి రాయలసీమ నేపధ్యం, ఫ్యాక్జనిజం వంటి అంశాల గురించి చర్చించాను.

నేనొక పేపర్ లో 'మొండికత్తి' అని ఒక కాలమ్ రాసేవాడ్ని. అదే కథని తన సినిమాలో ఒక భాగంగా వాడేశారు త్రివిక్రమ్. నేను శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలం నుంచి 'రాయలసీమ కథా సాహిత్యం' పై పి.హెచ్.డి, 'రాయలసీమ ఫ్యాక్షనిజం' పై ఎంఫిల్ పూర్తి చేశాను. అదే విధంగా సినిమాలో హీరోయిన్ ని 'రాయలసీమ ఫ్యాక్షనిజం' చదివే అమ్మాయిగా చూపించారు. నా పాత్రని ఆమెకి ఆపాదించారు. నా ఆలోచనలను, కథలను సినిమా కోసం వాడుకున్నారు.

కనీసం నాకు టైటిల్స్ లో క్రెడిట్ ఇవ్వలేదు. ఇవ్వాలని ఆశ పడే తత్వం కూడా నాకు లేదు. నేను కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతని.. నా విలువ నాకుంది. సినిమాలలో పేరు కోసం పాకులాడే మనిషిని కాదు. కానీ నేను ఎందుకు ఇంతగా బాధ పడుతున్నానంటే.. ఒక రచయిత అయిన త్రివిక్రమ్ సాటి రచయితకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. సాటి రచయితని ప్రోతహించాలే తప్ప.. వాళ్లని తొక్కుకుంటూ నేను ఎదగాలి అనుకోవడం తప్పు. కనీసపు నైతిక విలువలను పాటించలేదు.

ఇది మేథోపరమైన దోపిడీ.. రచయితగా గౌరవాన్ని సంపాదించుకొని ఓ స్థాయిలో ఉన్న నన్నే ఆయన మోసం చేశారంటే.. కొత్త వాళ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో చెప్పనక్కర్లేదు. నేను వివాదాలను కోరుకునే వ్యక్తిని కాను.. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఆవేదనతో ఈ విషయాలను బయటపెట్టాను. గ్రామీణ ప్రాంతంలో చాలా మంది రచయితలు ఉంటారు. వారు నాలాగా మోసపోకూడదనేది నా కోరిక.

శ్రీరెడ్డి లాంటి వాళ్లు తమను మోసం చేశారని రోడ్లు ఎక్కుతుంటే ఇప్పుడు మాకు కూడా అటువంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి. హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీల్లో ఉండే దర్శకులకు, రచయితలకు లోతుగా ఆలోచించే సమయం ఉండదు. 10 పుస్తకాలు చదివి.. అందులో పది పాత్రలు తీసుకొని ఓ కథ వండుతారు. ఇండస్ట్రీలో ఈ ధోరణి మారాలి. కొత్తగా వచ్చే సాహిత్యకారులకి అవకాశాలు ఇస్తే కొత్త కథలు పుట్టుకొస్తాయి. లేదంటే అవే ప్రేమలు, అవే కథలు ఇండస్ట్రీని నాశనం చేస్తాయి'' అంటూ చెప్పుకొచ్చారు. అలానే త్రివిక్రమ్ మీద ఫిలిం ఛాంబర్ లో ఫిర్యాదు చేయబోతున్న విషయాన్ని తెలిపారు. 

సంబంధిత వార్తలు..

'అరవింద సమేత' కథ నాది.. త్రివిక్రమ్ నన్ను మోసం చేశాడు: ప్రముఖ రచయిత ఆరోపణలు!

'అరవింద సమేత' ఫస్ట్ వీక్ కలెక్షన్స్!

త్రివిక్రమ్ పై కామెంట్లు.. ఎన్టీఆర్ ఘాటు సమాధానం!

'అరవింద సమేత'కి అక్కడ అవమానం!

'అరవింద సమేత'కి అక్కడ పెద్ద దెబ్బే!

'అరవింద సమేత' సెన్సేషనల్ రికార్డ్!

అరవింద సమేత: మూడు రోజుల కలెక్షన్స్!

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

click me!