నిర్మాతని ఇబ్బంది పెడుతోన్న హీరోయిన్!

By Udayavani DhuliFirst Published Oct 19, 2018, 3:17 PM IST
Highlights

కథకు తగ్గట్లుగా సినిమాలలో నటీనటులు తమ శరీరాకృతిని, లుక్ ని మైంటైన్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు గ్లామరస్ గా కనిపించడం కోసం కోట్లు కుమ్మరిస్తుంటారు నిర్మాతలు. అలాంటి గ్లామరస్ రోల్ కోసం ఓ హీరోయిన్ కి ఆడ్వాన్స్ ఇచ్చిన నిర్మాత ఇప్పుడు లబోదిబోమంటున్నాడు.

ఏడాది క్రితం ఓ హీరోయిన్ తో సినిమా చేయాలని భావించిన నిర్మాత ఆమెకి అడ్వాన్స్ గా కొంతమొత్తాన్ని ఇచ్చాడు. అప్పుడు ఆమె చాలా స్లిమ్ గా అందంగా కనిపించేది. కానీ ఈ ఏడాది కాలంలో ఆమె బొద్దుగా తయారైంది. ఆమె లుక్స్ తో అప్ సెట్ అయిన నిర్మాత శరీర బరువు తగ్గించుకోవాలని సూచించాడట.

కానీ దానికి ఆమె అంగీకరించకుండా ఆయన్ని ఇబ్బంది పెడుతుందని తెలుస్తోంది. గట్టిగా అడుగుతుంటే తన ఆరోగ్యం బాగాలేదని కబుర్లు చెబుతుందట. నిజానికి ఆరోగ్యపరంగా ఆమెకి ఎలాంటి సమస్యలు లేవని సమాచారం. సదరు హీరోయిన్ కి బీర్(మద్యం) అలవాటు ఉండడంతో  రోజురోజుకి లావుగా అవుతుందని టాక్.

ఆ అలవాటు మానుకోలేకే ఆమె బరువు తగ్గే ప్రయత్నం చేయడం లేదని సమాచారం. తీసుకున్న అడ్వాన్స్ వెనక్కి ఇవ్వాలని నిర్మాత డిమాండ్ చేస్తున్నా.. దానికి ఆమె ఒప్పుకోవడం లేదట. దీంతో ఏం చేయాలో తోచక నిర్మాత తలపట్టుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్!
 
click me!