లాక్ డౌన్ దెబ్బ: న‌టుడి ఆత్మ‌హ‌త్య‌

By Surya PrakashFirst Published May 17, 2020, 5:08 PM IST
Highlights

లాక్ డౌన్ ప్రభావం అన్ని రంగాలలోని వ్యక్తులపై చూపిస్తోంది. కేవలం అది వలస కార్మికులకో లేక కూలీకు వెళ్లి పొట్ట పోసుకునే వారికో కాక... జీవితంలో ఎన్నో ఆశలతో ముందుకు వెళ్తూ ఒక్కసారి జీవనం ఆగిపోయి అయోమయ స్దితిలోకి నెట్టబడిన వారిపైనా చూపిస్తోంది. తాజాగా ప్ర‌ముఖ హిందీ న‌టుడు, పంజాబీ పాత్ర‌ల్లో త‌ళుక్కున‌ మెరిసిన మ‌న్మీత్ గైవాల్(32) ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. 
 
ఆర్థిక ఇబ్బందులతో క‌ల‌త చెంద‌డం వ‌ల్లే శుక్ర‌వారం రాత్రి ముంబైలోని త‌న స్వ‌గృహంలో ఉరేసుకున్న‌ట్లు తెలుస్తోంది. కాగా పంజాబ్‌కు చెందిన‌ అత‌ను ప్ర‌స్తుతం ముంబైలోని ఖ‌ర్గార్‌లో త‌న భార్య‌తో క‌లిసి నివ‌సిస్తున్నాడు. లాక్‌డౌన్ వ‌ల్ల అన్ని రంగాల‌తో పాటు సినీరంగానికి బ్రేక్ ప‌డింది. షూటింగ్‌లు ఎక్క‌డికక్క‌డ నిలిచిపోవ‌డంతో ఉపాధి లేక‌ ఆర్థిక క‌ష్టాలు అత‌న్ని వెంటాడాయి. దీంతో అత‌ను తీవ్ర మాన‌సిక ఒత్తిడికి లోన‌య్యాడు.  

ఈ క్ర‌మంలోనే అత‌ను ఉరేసుకుని చ‌నిపోయిన‌ట్లు అత‌ని ఫ్యామిలీ ఫ్రెండ్ మంజీత్ సింగ్ రాజ్‌పుత్ మీడియాకు వెల్ల‌డించాడు. ఇక మ‌న్మీత్ 'ఆదత్ సే మజ్బూర్', 'కుల్దీపాక్' వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్ష‌కాద‌ర‌ణ సొంతం చేసుకున్నాడు. పలు టీవీ కార్యక్రమాలతో పాటు  కమర్షియల్ యాడ్స్ లో  కూడా కనిపించాడు. ఈ మ‌ధ్యే కొన్ని వెబ్ సిరీస్‌కు కూడా సైన్ చేశాడు. కానీ లాక్‌డౌన్ వ‌ల్ల ఆ ప్రాజెక్ట్‌లు ఇంకా ప‌ట్టాలెక్క‌లేదు. ప్రస్తుతం పొలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
click me!