టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ముగిసిన పూరి జగన్నాథ్ విచారణ.. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం

By Siva KodatiFirst Published Aug 31, 2021, 8:48 PM IST
Highlights

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ ఈరోజుకు పూర్తయ్యింది. దాదాపు 9 గంటలకు పైగా పూరిని ప్రశ్నించారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. పూరి బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా  ఆరా తీశారు. పూరిని మరోసారి విచారణకు పిలిచే అవకాశం వుంది. 

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ పూరి జగన్నాథ్ విచారణ ఈరోజుకు పూర్తయ్యింది. దాదాపు 9 గంటలకు పైగా పూరిని ప్రశ్నించారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు. పూరి బ్యాంక్ లావాదేవీలపై పూర్తిగా  ఆరా తీశారు. ఆయనకు చెందిన మూడు బ్యాంక్ ఖాతాల నుంచి సమాచారం సేకరించారు. ఉదయం 10.17నుంచి రాత్రి 7.45 గంటల వరకు విచారణ కొనసాగింది. పూరీని మరోసారి విచారణకు పిలిచే అవకాశం వుంది. 

కాగా, టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. అయితే తాను పూరి జగన్నాథ్ కోసం వచ్చానని.. తనకు ఎవరూ నోటీసులు ఇవ్వలేదని ఆయన చెబుతున్నారు. అసలు తనకెందుకు నోటీసులు ఇస్తారని బండ్ల గణేశ్ ప్రశ్నించారు. 

Also Read:టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ఈడీ కార్యాలయంలో ప్రత్యక్షమైన బండ్ల గణేశ్.. పూరి కోసం వచ్చానంటూ స్టేట్‌మెంట్

ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు ఈడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ 62 మందిని విచారించింది. డ్రగ్స్‌ కేసులో లబ్ధిదారుల అక్రమాస్తుల జప్తు దిశగా ఈడీ కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాధ్, రవితేజ, నవదీప్, తరుణ్, ఛార్మి, రానా, రకుల్, నందు,మొమైత్ ఖాన్, తనీష్ లతో పాటు రవితేజ డ్రైవర్, ఎఫ్ క్లబ్ ఓవర్ మొత్తం 12మందిని, ఈనెల 31నుండి సెప్టెంబర్ 22వరకు వరుసగా విచారించనున్నారు.  విదేశాలకు నిధుల తరలింపుపై వీరిని ఈడీ విచారించనుంది. వీరి విచారణ పూర్తి అయిన అనంతరం మరికొంత మందికి నోటీసులు జారీ చేసే అవకాశం కలదు.  

click me!