కరోనా లక్షణాలలో హాస్పటిల్ లో చేరిన టాలీవుడ్ నటుడు

By Surya PrakashFirst Published Mar 24, 2020, 1:30 PM IST
Highlights

ఈ నేపధ్యంలో అన్ని రంగాలు వారు తమదైన శైలిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే తాజాగా రెండు వారాల కిందట బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ నటుడులో కరోనా లక్షణాలు బయిటపడ్డాయిని సమాచారం.

దేశంలోని 32 రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రస్తుతం లాక్‌డౌన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా విదేశాలు నుంచి తిరిగి వస్తున్న వారితో ఈ సమస్య మరీ జటిలం అయిపోతోంది. ఈ నేపధ్యంలో అన్ని రంగాలు వారు తమదైన శైలిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇళ్లకే పరిమితం అవుతున్నారు. అయితే తాజాగా రెండు వారాల కిందట బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఓ నటుడులో కరోనా లక్షణాలు బయిటపడ్డాయిని సమాచారం.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఆ నటుడు హైదరాబాద్ లో కొన్ని రోజులున్నాడు. తాజాగా తన స్వగ్రామం అయిన ఆంద్రప్రదేశ్ లోని  గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చేరుకున్నాడు. వచ్చిన రోజు నుంచి తీవ్రమైన జ్వరం, జలుబుతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అర్జెంటుగా అతడ్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న ఐసోలేషన్ వార్డుకు తరలించి ట్రీట్ మెంట్ ఇవ్వటం మొదలెట్టారు. ఈ నటుడు అనేక  సినిమాల్లో సహాయ నటుడిగా కనిపించాడు.

వాస్తవానికి ఇతడికి వారం రోజుల నుంచే జబులు, జ్వరం ఉంది కానీ గాంధీ ఆస్పత్రికి వెళ్లడానికి ఇష్టపడకపోవటమే కొంప ముంచిందంటున్నారు. కనీసం దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు వెళ్లినా సమస్య ఇంతదాకా వచ్చేది కాదంటున్నారు. స్థానికంగా ఉన్న మెడికల్ షాపులో మందులు కొని వేసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఇంటికి చేరిన తర్వాత కూడా ట్రీట్ మెంట్ కు నిరాకరించడంతో.. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఇది బయటకు వచ్చింది. 

వెంటనే గుంటూరు హాస్పిటల్ సిబ్బంది వచ్చి అతడ్ని ఐసొలేషన్ వార్డ్ కు తరలించారు. శాంపిల్స్ కు టెస్టింగ్ కు పంపించారు.
కరోనా సోకిన బాధితుల వివరాల్ని ఇప్పటివరకు ప్రభుత్వాలు అధికారికంగా వెల్లడించని నేపధ్యంలో ఇతని వివరాలు బయిటకు రాలేదు.కేవలం నటుడు అని మాత్రమే తెలిసిందే. అతడి కుటుంబ సభ్యుల్ని కూడా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంచారు. ఇప్పుడు అతడు ప్రస్తుతం పని చేసిన సినిమా యూనిట్ సభ్యుల వివరాల్ని కనుక్కునే పనిలో పడ్డారు పోలీస్ లు.

click me!