
మొత్తానికి వరుసగా అయిదవ సినిమాతో కూడా హిట్టందుకున్నాడు తారక్. అరవింద సమేతకు అందుతున్న కలెక్షన్స్ చూస్తుంటే సినిమా విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఏ మాత్రం టైమ్ వేస్ట్ చేయకుండా తన కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు.
అయితే తారక్ నెక్స్ట్ సినిమా విషయానికి వస్తే రామ్ చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. దర్శకదీరుడు రాజమౌళి తెరకెక్కించనున్న ఆ #RRR ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందో చెప్పడం కష్టమే. ఇప్పటివరకు నిదానంగా ఏడాదికో సినిమా చేసుకుంటూ వస్తున్న తారక్ ఇప్పుడు జక్కన్న ప్రాజెక్ట్ కోసం సమయాన్ని ఎక్కువ తీసుకోనున్నాడు.
వచ్చే ఏడాది తారక్ నుంచి ఏ సినిమా ఉండదు. ఎందుకంటే రాజమౌళి దాదాపు బాహుబలి రేంజ్ లో మల్టీస్టారర్ కు బడ్జెట్ పెడుతున్నాడు కాబట్టి రెండేళ్ళైనా పడుతుంది. అది కూడా కరెక్ట్ సమయమని చెప్పలేము. 2020సమ్మర్ లో వస్తుందని చెబుతున్నప్పటికీ జక్కన్న మీద నమ్మకం పెట్టుకోవడం కష్టమే. అవుట్ ఫుట్ బావుండాలని ఒక ఏడాది ఎక్కువ అనుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
చరణ్ ఈ లోపు అభిమానులకు బోయపాటి తో చేస్తున్న సినిమాను ఇచ్చేస్తాడు. కానీ తారక్ నుంచే ఇక రెండేళ్ల వరకు ఎలాంటి సినిమా ఉండదు. పూర్తిగా ఇద్దరు హీరోలు #RRR పైనే ద్రుష్టి పెట్టనున్నారు. ప్రతిష్టాత్మక చిత్రం కావడంతో డేట్స్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరో ప్రాజెక్ట్ జోలికి వెళ్లకూడదని ఫిక్స్ అయ్యారు. మరి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి.
సంబంధిత వార్తలు
అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!
అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!
అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!
అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)
తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!
యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత
'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!
అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!
‘అరవింద సమేత’విడుదల.. టీడీపీ, వైసీపీ గొడవ