జగపతి రెమ్యునరేషన్ పెరిగిందా?

Published : Oct 13, 2018, 01:10 PM IST
జగపతి రెమ్యునరేషన్ పెరిగిందా?

సారాంశం

కథానాయకుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించిన జగపతి బాబు అప్పటి కన్నా ఇప్పుడే ప్రతి నాయకుడిగా ఎక్కువ క్రేజ్ అందుకున్నాడని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆయన చేసిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది.

కథానాయకుడిగా ఎన్నో సినిమాల్లో కనిపించిన జగపతి బాబు అప్పటి కన్నా ఇప్పుడే ప్రతి నాయకుడిగా ఎక్కువ క్రేజ్ అందుకున్నాడని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఆయన చేసిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. లెజెండ్ సినిమాలో విలన్ గా కనిపించి సరికొత్త నటనను చూపించిన జగపతి ఆ తరువాత డిఫరెంట్ విలన్ రోల్స్ చేయడం మరింత ప్లస్ అయ్యింది. 

నాన్నకు ప్రేమతో - రంగస్థలం సినిమాలు ఆయన స్థాయిని పెంచాయి. ఇక అరవింద సమేత విషయానికి వస్తే త్రివిక్రమ్ ఇచ్చిన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. ఆయన పై విమర్శలు చేసేవారు బాసిరెడ్డి పాత్రను చుస్తే పొగడకుండా ఉండలేరు. ఇకపోతే అరవింద సమేత సక్సెస్ తో ఇప్పుడు జగపతి బాబు రేంజ్ పెరిగింది. దీంతో రెమ్యునరేషన్ కూడా పెరిగినట్లు తెలుస్తోంది. 

ఆల్ రెడీ కొన్ని సినిమాలను పెండింగ్ లిస్ట్ లో పెట్టిన జగపతి ఇప్పుడు వాటిని ఒకే చేయలేనంత బిజీగా ఉన్నాడు. ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయి. జగపతి అలోచించి చెబుతానని చెప్పినప్పటికీ రెమ్యూనరేషన్ ఎక్కువ ఇచ్చి మరి ఒప్పిస్తున్నారట. ఇకపోతే జగపతి బాబు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహ రెడ్డి సినిమాలో నటిస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు