
కాలం మారుతున్న కొద్దీ టాలీవుడ్ భవిష్యత్తు కూడా మారుతోంది. మన స్టార్ హీరోలు బాలీవుడ్ స్టార్స్ కి ఏ మాత్రం తీసిపోకుండా బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు అన్ని జానర్ సినిమాలు వచ్చాయి. ఇక భారీ బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాలు బాకీ ఉన్నాయి.
ఈ రోజుల్లో మల్టీస్టారర్ సినిమాలను తెరకెక్కించడం సాధారణమైన విషయం కాదు. అయితే దర్శకధీరుడు రాజమౌళి ఆ డ్రీమ్ ను తెరపైకి తెనున్నాడు. రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ లతో #RRR ప్రాజెక్ట్ ని సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్నీ ఎండ్ అయ్యాయి. ఈ డిసెంబర్ లో షూటింగ్ ని మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ సన్నహకలు చేస్తోంది. అయితే దానికంటే ముందు జక్కన్న తారక్ - చరణ్ లకు వర్క్ షాప్ నిర్వహించనున్నాడు.
అది అయిపోగానే సినిమా రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. ఇక మిగతా నటీనటులు విషయంలో కూడా దర్శకుడు ఒక డిసిషన్ కి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారికంగా సినిమాకు సంబంధించిన విషయాలని తెలియజేయనున్నారు. ఇక డివివి.దానయ్య ఈ చిత్రం కోసం భారిగా ఖర్చు పెట్టడానికి సిద్ధమయ్యారు. దాదాపు 150 కోట్ల వరకు బడ్జెట్ దాటే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక సినిమాను 2020 సమ్మర్ లో రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
#RRR: తారక్ చరణ్.. దొంగా - పోలీస్!
మల్టీస్టారర్ గురించి షాకిచ్చిన చరణ్
షాక్.. మరోసారి నెగెటివ్ క్యారెక్టర్ లో తారక్.?
#RRR సినిమాకి రైటర్ విజయేంద్రప్రసాద్ కాదట
రాజమౌళి మూవీలో విలన్ గా రాజశేఖర్..