#మీటూ: ఆమె చెప్పింది ధనుష్ పేరేనా?

By Prashanth MFirst Published Oct 13, 2018, 4:35 PM IST
Highlights

#మీటూ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు బాలీవుడ్ లో మాములుగా వైరల్ అవ్వడం లేదు.  దాని సెగ ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్త్రీలకు కూడా స్ట్రాంగ్ గా తాకుతోంది. కేంద్రం కూడా ఈ వేడిని చల్లార్చేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. 

#మీటూ హ్యాష్ ట్యాగ్ ఇప్పుడు బాలీవుడ్ లో మాములుగా వైరల్ అవ్వడం లేదు.  దాని సెగ ఇప్పుడు కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్త్రీలకు కూడా స్ట్రాంగ్ గా తాకుతోంది. కేంద్రం కూడా ఈ వేడిని చల్లార్చేందుకు చర్యలు తీసుకోవడానికి సిద్ధమైంది. అయితే చాలా మంది నటీమణులు ఇప్పుడు వారికి ఎదురైనా చేదు అనుభవాలను గురించి సోషల్ మీడియాలో ద్వారా చెప్పేస్తున్నారు. 

ఇక మరికొందరు హీరోయిన్స్ వేధింపుల విషయంలో డైరెక్ట్ గా పేర్లు బయటపెట్టకుండా పజిల్స్ వదులుతున్నారు. రీసెంట్ గా హాట్ బ్యూటీ అమైరా దస్తూర్ సౌత్ లో తనకు వేధింపులు ఎదురయ్యాయని చెప్పిన విధానం కూడా అలానే ఉంది. అమ్మడు సౌత్ లో చేసింది మూడు సినిమాలే. అయితే బాగా పలుకుబడి స్టార్ డమ్ ఉన్న హీరో నుంచి తనకు చేదు అనుభవం ఎదురైనట్లు మీటూ లో భాగంగా వివరించింది. 

అమైరా దస్తూర్ సౌత్ లో రాజ్ తరుణ్ - రాజుగాడు సినిమాలో చేసింది. అలాగే సందీప్ కిషన్ మనసుకు నచ్చింది సినిమాతో పాటు కోలీవుడ్ లో ధనుష్ హీరోగా తెరకెక్కిన 'అనేగన్'( తెలుగులో అనేకుడు) సినిమాలో కూడా నటించింది. అయితే వీరిలో బాగా పలుకుబడి ఉన్న స్టార్ హీరో ఎవరో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మంచి బ్యాక్ గ్రౌండ్ ఉన్న హీరో ధనుష్. దీంతో నెటిజన్స్ అమైరా స్టేట్మెంట్ పై భిన్నభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు.

click me!