పొగడ్తలతో ముంచేసిన అబ్బాయ్... థాంక్స్ అంటున్న బాబాయ్..!

By Satish ReddyFirst Published Aug 14, 2020, 6:45 PM IST
Highlights

వెండితెరపై వరుస విజయాలతో విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ సీనీ ప్రస్థానానికి 34 ఏళ్ళు. కామెడీ, లవ్, రొమాన్స్, యాక్షన్ అన్ని కలగలిపి, అన్ని వర్గాల హీరోగా పేరుతెచ్చుకున్న వెంకటేష్ మొదటి చిత్రం కలియుగ పాండవులు విడుదలై నేటికీ సరిగ్గా 34ఏళ్ళు. ఈ సందర్భంగా దగ్గుబాటి రానా బాబాయ్ వెంకీపై ఆసక్తికర ట్వీట్ వేశారు.

వెండితెరపై సింబల్ ఆఫ్ విక్టరీగా పేరుతెచ్చుకున్నారు దగ్గుబాటి వెంకటేష్. లెజెండరీ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు రెండో కుమారుడైన వెంకటేష్ సినీ ప్రస్థానికి 34ఏళ్ళు. వెంకటేష్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన కలియుగ పాండవులు చిత్రంతో  వెండితెరకు పరిచయం అయ్యారు. ఆగస్టు 14, 1986న విడుదలైన ఆ చిత్రం నేటితో 34ఏళ్ళు పూర్తి చేసుకుంది. అసలు వెంకీ వెండితెర ఎంట్రీ కూడా నాటకీయంగా జరిగిందట. నిజానికి కలియుగ పాండవులు మూవీ సూపర్ స్టార్ కృష్ణతో చేయాలనుకున్నారట రామానాయుడు. ఐతే కొన్ని కారణాల వలన కృష్ణ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు.

కలియుగ పాండవులు స్టోరీ కోసం హీరోని వెతుకుతుండగా అప్పుడే విదేశాలలో ఎంబీఏ పూర్తి చేసిన వచ్చిన వెంకటేష్ తో చేయండి అని సన్నిహితులు సలహా ఇచ్చారట. దానితో వెంకీని బిజినెస్ మెన్ చేద్దాం అనుకున్న రామానాయుడు హీరోని చేశారు. 34 ఏళ్ల సినీ జర్నీలో వెంకటేష్ సక్సెస్ ఫుల్ హీరోగా పేరుతెచ్చుకున్నారు. పరిశ్రమలో వెంకటేష్ కి ఉన్నంత సక్సెస్ రేట్ మరో హీరోకి లేదు. అందుకే వెంకీని నిర్మాతల హీరో అంటారు. ఇక 20పైగా రీమేక్ లు చేసిన వెంకీ చంటి, రాజా, సుందరాకాండ, కొండపల్లి రాజా, చిరాయుడు, సూర్యవంశం, బాడీ గార్డ్, దృశ్యం వంటి హిట్స్ అందుకున్నారు. 

కాగా వెంకీ 34ఏళ్ల సీనీ ప్రస్థానాన్ని పురస్కరించుకొని కొత్తపెళ్లి కొడుకు దగ్గుబాటి రానా  ట్విట్టర్ వేదికగా బెస్ట్ విషెష్ తెలిపారు. ఇక బాబాయ్ వెంకీని ఆయన స్టయల్ , సింప్లిసిటీ, విక్టరీకి సింబల్ గా పోల్చాడు. దీనికి వెంకటేష్ థాంక్స్ రానా అని ట్వీట్ చేశారు. గత ఏడాది మేనల్లుడు నాగ చైతన్యతో కలిసి వెంకీ మామ మూవీ చేసిన వెంకటేష్ ప్రస్తుతం తమిళ్  అసురన్ రీమేక్ నారప్పలో నటిస్తున్నారు. ఐతే బాబాయ్ అబ్బాయిలైన వెంకీ, రానా కలిసి ఓ మల్టీ స్టారర్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Thank you Rana ❤️🤗 https://t.co/BN6Op7Bh9N

— Venkatesh Daggubati (@VenkyMama)
click me!