రాజమండ్రి రిసార్ట్ లు బుక్కింగ్.. 'ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్' లో షూట్

By Surya PrakashFirst Published Oct 12, 2020, 12:38 PM IST
Highlights

కరోనా వ్యాప్తి కారణంగా అనవసరంగా రిస్కు తీసుకోకూడదని భావించిన అల్లు అర్జున్, అల్లు అరవింద్ కేరళ రాష్ట్రానికి వెళ్లి షూటింగ్ జరిపే ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం. దాంతో షూటింగ్ ని రాజమండ్రి దగ్గరలోని మారేడుమిల్లి అడవుల్లో జరపాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు రాజమండ్రి ఏరియాలో రిసార్ట్ లు బుక్ చేస్తున్నారట.

ప్రముఖ దర్శకుడు సుకుమార్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సారి తెరకెక్కబోతున్న చిత్రం పుష్ప. ఈ  సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఊహించని విధంగా అభిమానుల ఆశలపై కరోనా మహమ్మారి నీళ్లు చల్లింది. ఈ సినిమా ఎర్రచందనం అక్రమ రవాణా బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో తెరకెక్కుతుండగా కేరళ రాష్ట్రం షూట్ కు బాగా సూట్ అవుతుందని భావించిన సుకుమార్… కేరళలోనే షూటింగ్ పూర్తి చేయాలని ఓ ప్లాన్ వేసుకున్నారు. 

కానీ కరోనా వ్యాప్తి కారణంగా అనవసరంగా రిస్కు తీసుకోకూడదని భావించిన అల్లు అర్జున్, అల్లు అరవింద్ కేరళ రాష్ట్రానికి వెళ్లి షూటింగ్ జరిపే ప్రసక్తే లేదని చెప్పినట్లు సమాచారం. దాంతో షూటింగ్ ని రాజమండ్రి దగ్గరలోని మారేడుమిల్లి అడవుల్లో జరపాలని డిసైడ్ చేసినట్లు సమాచారం. ఈ మేరకు రాజమండ్రి ఏరియాలో రిసార్ట్ లు బుక్ చేస్తున్నారట.

ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యేదాకా మొత్తం నటీనటులు, టెక్నీషియన్స్..అందరూ ఆ రిసార్ట్ లోనే ఉండాలని, ఎవరూ కూడా అడుగు బయిటపెట్టకూడదని, అలాగే ఎవరూ కూడా ఆ సెట్స్ కు రాకూడదని డిసైడ్ చేసారట. షూటింగ్ స్పాట్  మొత్తం టోటల్ ఏరియాను బ్లాక్ చేస్తున్నారట. కరోనా సమస్య రాకుండా కొత్తవారి ఎంట్రీ ఎట్టి పరిస్దుతుల్లో ఉండకూడదని సుకుమార్ తన టీమ్ కు ఆర్డర్ వేసారట.  రీసెంట్ గా మొదలైన ఆర్ ఆర్ ఆర్, లవ్ స్టోరీ సినిమాలు రెండూ కూడా షూటింగ్ లు ఇదే పద్దతిని ఫాలో అవుతూ ప్రారంభించాయి. 

అలాగే షూటింగ్స్ మొదలైనా కూడా కరోనా పట్ల నటీనటులు, సాంకేతిక నిపుణుల్లో ఉన్న భయాలు తొలగిపోయేలా కనిపించడం లేదు. దాంతో  అందరిలో ధైర్యం నింపేలా 'ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్' ఉపయోగించనున్నారట సుకుమార్. ఈ నెలాఖరు నుండి పుష్ప‌ షూటింగ్ మొదలు పెట్టేసి ఈ మెథడ్ అప్లై చేయనున్నారట. 

ఇందులో భాగంగా మొదటగా నెల రోజుల పాటు ప‌రిమిత సంఖ్య‌లో యూనిట్ స‌భ్యుల‌ను అనుమతించి షూటింగ్‌ స్టార్ట్ చేస్తార‌ట‌. ఆ స‌మ‌యంలో స‌భ్యులంద‌రూ ఓ ప్రాంతంలోనే ఉండేలా చూస్తూ.. వాళ్ళెవరూ ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం, అదేవిధంగా ఇత‌రులు వీలున్న ప్ర‌దేశానికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవడం లాంటివి చేస్తారట. ఈ ప్లాన్ వర్కవుట్ అయిందంటేనే త‌దుప‌రి షెడ్యూల్స్ ప్లాన్ చేస్తార‌ట. అందుకే అందరిలో ధైర్యం నింపేలా 'ట్ర‌య‌ల్ అండ్ ఎర్రర్ మెథడ్' ఉపయోగించనున్నారట డైరెక్టర్ సుకుమార్.
 

click me!