#PakkaCommercial:ఓటీటీ రిలీజ్ ప్రకటన, అక్కడ గట్టిగా చూస్తారా?

By Surya PrakashFirst Published Jul 31, 2022, 11:37 AM IST
Highlights

గోపిచంద్ హీరోగా గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా హీరోయిన్ గా నటించిన ఎంటర్టైనర్ “పక్కా కమర్షియల్” ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి బజ్ నడుమ రిలీజ్ అయ్యింది కానీ అంచనాలు అయితే థియేట్రికల్ గా అందుకోలేకపోయింది.

మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. ఈ సినిమా అనుకున్న స్దాయిలో వర్కవుట్ కాలేదు. కలెక్షన్స్ పరంగా సినిమా ఫ్లాఫ్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ కు రెడీ అయ్యింది.

అందుతున్న సమాచారం మేరకు  ఈ సినిమా విడుదలకు ముందే డిజిటల్ రైట్స్‌ను రెండు ప్రముఖు ఓటీటీ సంస్థలు కొన్నాయి. ఇప్పుడు వాళ్లే ఓటిటిలో రిలీజ్ చేస్తున్నారు. వాటిలో ఒకటి దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కాగా మరొకటి అణా తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా అట. ఈ రెండు స్త్రీమింగ్స్ సంస్థలతో ఓటిటి డీల్ మేకర్స్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమా ఈ రెండు ఓటీటీల్లో ఆగస్టు 5 నుండి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్‌లో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వస్తోంది. 

బాక్సాఫీస్ వద్ద ఈ ‘పక్కా కమర్షియల్’ సినిమాకి రూ.17.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కొన్ని ఏరియాల్లో ‘గీతా ఆర్ట్స్’ మరియు ‘యూవీ క్రియేషన్స్’ సంస్థలే ఓన్ గా రిలీజ్ చేసుకున్నాయి. కాబట్టి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.15 కోట్లు. ఎలాగూ మిక్స్డ్ టాక్ ఉంది కాబట్టి.. ఇక కలెక్షన్స్ రావడం కష్టమే అనుకున్నారు. కానీ మార్కెట్లో వేరే సినిమాలు లేకపోవటంతో  అనూహ్యంగా ‘పక్కా కమర్షియల్’ బాక్సాఫీస్ ఉన్నంతలో వర్కవుట్ అయ్యింది.  ప్లాప్ టాక్ వచ్చిన ఒక సినిమాకి,  మాగ్జిమం రికవరీ అవడం మొదటిసారి. సాలిడ్ హిట్ అని చెప్పలేం కానీ  గోపీచంద్ కు డిజాస్టర్ అయితే మాత్రం కాదు. 

click me!