కరోనా ఎఫెక్ట్ : వారం తిరక్క ముందే అమెజాన్ ప్రైమ్ లో!

By Surya PrakashFirst Published Mar 18, 2020, 11:58 AM IST
Highlights

కరోనా దెబ్బకు థియోటర్స్ ఎలాగో లేవు. ఎక్కడో చోట మన సినిమా జనాలకు రీచ్ అవటం ముఖ్యం కదా అని నిర్మాతలు ఫీల్ అవుతున్నారు. అందుకేనేమో వారం తిరక్కముందే ...ఓ పిట్టకథ సినిమాని  అమెజాన్ ప్రైమ్ లో  పెట్టేసారు. 


అమెజాన్ ప్రైమ్ లో రిలీజైన కొద్దిరోజులకే సినిమా స్ట్రీమ్ చేసేస్తున్నారు. సినిమా థియోటర్ కలెక్షన్స్ ని అది దెబ్బ కొట్టేస్తోంది అంటూ ఆ మధ్యన నిర్మాతలు గోలెత్తిపోయారు. ఇప్పుడు కరోనా దెబ్బకు థియోటర్స్ ఎలాగో లేవు. ఎక్కడో చోట మన సినిమా జనాలకు రీచ్ అవటం ముఖ్యం కదా అని నిర్మాతలు ఫీల్ అవుతున్నారు. అందుకేనేమో వారం తిరక్కముందే ...అమెజాన్ ప్రైమ్ లో తమ సినిమాని పెట్టేసారు. దాంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ సీనియర్ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా నిత్య శెట్టి హీరోయిన్ గా చెందు ముద్దు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఓ పిట్ట కథ”. త్రివిక్రమ్ మొదలుకుని,మహేష్ బాబు మెగాస్టార్ మరియు ఇతర స్టార్ హీరోలతో సైతం ప్రమోషన్స్ చేయించుకున్నారు. రిలీజై కు ముందు మంచి హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం మార్చ్ 6న విడుదలైంది. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లోకి వచ్చేసింది.దీనితో ఇది చూసిన వారు అప్పడే వచ్చేయడం ఏమిటని ఖంగుతింటున్నారు.  అయితే థియోటర్స్ క్లోజ్ వలన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు.

ఇదంతా కరోనా వైరస్ ఎఫెక్ట్ . ఈ వైరస్ ప్రభావం ఇప్పుడు మన దేశ వ్యాప్తంగా ఏ స్థాయిలో పడుతుందో మనం చూస్తున్నాము.ఈ వైరస్ విజృంభణ మూలాన షాపింగ్ మాల్స్, థియేటర్స్, స్కూల్స్ ఇలా జన సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలు అన్ని మూత పడిపోయాయి.ముఖ్యంగా థియేటర్స్ క్లోజ్ చేసేసారు. వీటి కారణంగా చిన్న సినిమాలకు చాలా దెబ్బ పడుతుంది అని చెప్పాలి.దీనితో వారి సినిమాలు సర్వైవ్ అయ్యేందుకు చిన్న సినిమాలను తప్పనిసరి పరిస్థితుల్లో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి తీసుకొచ్చేస్తున్నారు. అలా వచ్చిందే పిట్టకథ.

ఒక విలేజ్‌లో జరిగే స్టోరీ ఇది. ప్రతి సన్నివేశం స్వచ్ఛంగా సాగుతుంది. ఓ వైపు కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది. మరోవైపు ఏంజరుగుతోందనే ఉత్కంఠను రేకెత్తిస్తుంది . పతాక సన్నివేశాల వరకూ ఆ థ్రిల్లింగ్‌ అలాగే సస్టైన్‌ అవుతుంది. ట్విస్టులు మరింత థ్రిల్‌ కలిగిస్తుంటాయి. స్క్రీన్‌ ప్లే ప్రధానంగా తెరకెక్కించారు.

click me!