పవన్ కళ్యాణ్ డైలాగ్ ని పలికిన ఎన్టీఆర్!

Published : Oct 15, 2018, 12:30 PM ISTUpdated : Oct 15, 2018, 12:48 PM IST
పవన్ కళ్యాణ్ డైలాగ్ ని పలికిన ఎన్టీఆర్!

సారాంశం

మెగా, నందమూరి అభిమానులు 'అరవింద సమేత' సినిమాతో ఒక్కటయ్యారు. పవన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 'అరవింద సమేత'ని సపోర్ట్ చేస్తూ పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి తమ సపోర్ట్ తెలుపుతూ ట్వీట్లు, పోస్ట్ లు పెట్టారు. 

మెగా, నందమూరి అభిమానులు 'అరవింద సమేత' సినిమాతో ఒక్కటయ్యారు. పవన్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 'అరవింద సమేత'ని సపోర్ట్ చేస్తూ పోస్టర్లు, ఫ్లెక్సీలు పెట్టారు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కి తమ సపోర్ట్ తెలుపుతూ ట్వీట్లు, పోస్ట్ లు పెట్టారు.

వారి సంతోషం కోసమో, లేక మాటల ప్రసంగంలో భాగంగా మాట్లాడారో తెలియదు కానీ ఎన్టీఆర్ ఇటీవల జరిగిన 'అరవింద సమేత' సక్సెస్ మీట్ లో తన స్పీచ్ లో పవన్ కళ్యాణ్ డైలాగ్ ని చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో క్లైమాక్స్ ఎపిసోడ్ లో పవన్ కళ్యాణ్ 'కంటికి కనిపించని శత్రువుతో బయటకి కనబడని యుద్ధం చేస్తున్నా' అనే డైలాగ్ చెబుతాడు. అదే డైలాగ్ ని తన ప్రసంగంలో ఒక చోట పలికాడు ఎన్టీఆర్.

అయితే పవన్ కళ్యాణ్ పేరుని కానీ సినిమా పేరుని కానీ ప్రస్తావించకుండా.. త్రివిక్రమ్ ఒక సినిమాలో రాసిన డైలాగ్ అంటూ చెప్పాడు. తనతో చేయాల్సిన సినిమాకు కథ తయారు చేసే క్రమంలో త్రివిక్రమ్ తనలో తానే యుద్ధం చేసినట్లు ఎన్టీఆర్ తెలిపాడు. అరవింద సమేత కంటే ముందు తనకి రెండు కథలు చెప్పాడని, కానీ అరవింద సమేత కథ చెప్పినప్పుడు అతడి కళ్లలో స్పార్క్ కనిపించిందని ఎన్టీఆర్ అన్నారు. 

సంబంధిత వార్తలు..

త్రివిక్రమ్ నా బావ.. నా భార్యకు అన్న: ఎన్టీఆర్

అరవింద సమేత శాటిలైట్ రైట్స్.. తారక్ కెరీర్ లోనే బెస్ట్ డీల్!

అరవింద సమేత: ఫస్ట్ డే కలెక్షన్స్..తారక్ కుమ్మేశాడు!

అరవింద సమేత: యూఎస్ లో న్యూ రికార్డ్!

అభినయ సమేత...('అరవింద సమేత' రివ్యూ)

తారక్ తగ్గట్లేదుగా.. యూఎస్ లో రికార్డ్ కలెక్షన్స్!

యూఎస్ ప్రీమియర్ షో టాక్: అరవింద సమేత

ట్విట్టర్ రివ్యూ: అరవింద సమేత

'అరవింద సమేత' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

అరవింద సమేత కోసం స్పెషల్ హాలిడే ఇచ్చేశారు!

PREV
click me!

Recommended Stories

Naga Chaitanya: నా భర్తను అలా పిలవొద్దు.. శోభిత కి కోపం వచ్చేసిందిగా..!
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి విలన్ గా రెండు నిమిషాలు మాత్రమే కనిపించిన సినిమా ఏదో తెలుసా?