షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

Published : Oct 15, 2018, 11:39 AM IST
షూటింగ్ లకి రామ్ చరణ్ డుమ్మా.. కారణమేమిటంటే..?

సారాంశం

స్టార్ హీరో రామ్ చరణ్ షూటింగ్ లకి అప్పుడప్పుడు డుమ్మా కొడుతుంటాడని ఇన్సైడ్ వర్గాల టాక్. కానీ అది ఆయన కావాలని చేయరని తెలుస్తోంది. అందరి హీరోల మాదిరి రామ్ చరణ్ కి కూడా అదే సమస్యతో బాధ పడుతున్నారని అందుకే అప్పుడప్పుడు షూటింగ్ లకి హాజరు కాలేకపోతున్నాడని సమాచారం. 

ఇంతకీ ఆ సమస్య ఏంటంటే..? బ్యాక్ పెయిన్. రామ్ చరణ్ మాత్రమే కాదు స్టార్ హీరోలందరూ ఇదే సమస్యతో బాధ పడుతున్నారని సమాచారం. పవన్ కళ్యాణ్ కి కూడా ఈ సమస్య తీవ్రంగానే ఉంటుందట. అందుకే షెడ్యూల్స్ కి సరిగ్గా హాజరు కాలేరని టాక్. మహేష్ బాబు షెడ్యూల్, షెడ్యూల్ కి మధ్య గ్యాప్ తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేస్తారు.

ఎన్టీఆర్, బన్నీలకి కూడా ఈ సమస్య ఉందట. అయితే రామ్ చరణ్ ఈ నొప్పిని భరించలేక షూటింగ్ ఎగ్గొడుతుంటారని టాక్. దీనంతటికీ కారణం సినిమాలో రోప్ ఫైట్ లని తెలుస్తోంది. భారీ యాక్షన్ సీన్స్, గాల్లోకి ఎగిరి ఫైట్ చేసే సన్నివేశాల్లో హీరోలకి రోప్ లు కట్టి లాగుతుంటారు.

ఈ క్రమంలో వారి ఆరోగ్యం పాడవుతుందని తెలుస్తోంది. అయితే ఫ్యాన్స్ కోసం అటువంటి ఫైట్స్ చేయక తప్పడం లేదు. ఈ మధ్య కాలంలో హీరోలు అవసరమైతే తప్ప రోప్ ఫైట్ లు పెట్టొద్దని ముందే చెబుతున్నారట.  

PREV
click me!

Recommended Stories

Akhil Raj: అమ్మను తిడితే ఊరుకోవాలా? డెలివరీ బాయ్ వివాదంపై స్పందించిన రాజు వెడ్స్ రాంబాయి హీరో..
Yash Next Movie: టాక్సిక్‌ని పక్కన పెట్టిన యశ్‌.. నెక్ట్స్ మూవీ ఇదే, స్టోరీ లీక్.. సెన్సేషనల్‌ హీరోయిన్‌