మోహన్ లాల్ పై కేసు...ఫేస్ బుక్ లో ప్రచారం

By Surya PrakashFirst Published Mar 28, 2020, 12:13 PM IST
Highlights

కొన్ని ఆన్ లైన్ మీడియా పోర్టల్స్‌ ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నాయని, మోహన్ లాల్ వీరిపై చర్య తీసుకునే అవకాశం ఉందని అన్నారు. కమీషన్ తమ దగ్గరకు ఏ విధమైన కంప్లైంట్ రాలేదని, ఏ ఆర్డర్ పాస్ చేయలేదని అన్నారు. ఫేస్ బుక్ లో ఎవరో పెట్టిన ఓ  పోస్ట్ ఆధారంగా న్యూస్ రాసేయటం పద్దతి కాదన్నారు. 

నిన్నటి నుంచీ మానవ హక్కుల సంఘంలో మోహన్ లాల్ పై ఓ కేసు నమోదు అయ్యిందంటూ ప్రచారం జరగటం మొదలైంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై పీఆర్వో ఎమ్ బిను కుమార్.. మాట్లాడుతూ... ఎలాంటి కేసు మోహన్ లాల్ పై మానవ హక్కుల కమీషన్ లో నమోదు కాలేదని అన్నారు. ఇది ఎవరో పుట్టించిన రూమర్, ఇలాంటి వార్తలు నమ్మ వద్దు అని చెప్పారు. 

కొన్ని ఆన్ లైన్ మీడియా పోర్టల్స్‌ ఈ న్యూస్ ని స్ప్రెడ్ చేస్తున్నాయని, మోహన్ లాల్ వీరిపై చర్య తీసుకునే అవకాసం ఉందని అన్నారు. కమీషన్ తమకు దగ్గరకు ఏ విధమైన కంప్లైంట్ రాలేదని, ఏ ఆర్డర్ పాస్ చేయలేదని అన్నారు. ఫేస్ బుక్ లో ఎవరో పెట్టిన ఓ  పోస్ట్ ఆధారంగా న్యూస్ రాసేయటం పద్దతి కాదన్నారు. 

అతను ఆన్ లైన్ లో  కంప్లైంట్ చేసి ఉండవచ్చు. మేము ఇంకా ఏ కంప్లైంట్ ని పరిగణనలోకి తీసుకోలేదు. అంతా ఓ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. అలా ఆన్ లైన్ లో ఓ ఫిర్యాదు చేసి, వెంటనే పబ్లిసిటీ చేసుకోవటం పద్దతి కాదన్నారు. ఇంతకీ మోహన్ లాల్ మీద ఏ విషయంలో మానవ హక్కుల కమీషన్ వద్ద కేసు పెట్టబోయారు అంటే..  

ప్ర‌స్తుతం క‌రోనా విజృంభిస్తున్న నేప‌థ్యంలో మోహన్ లాల్ మొన్న జనతా కర్ఫూ రోజున  ప్ర‌జ‌ల‌ని ఉద్ధేశించి కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. క‌లిసి చ‌ప్ప‌ట్లు కొడితే క‌రోనా చ‌నిపోయే అవ‌కాశం ఉంటుంది. చ‌ప్ప‌ట్ల శ‌బ్ధం నుండి మంత్రం లాంటిది పుట్టుకొస్తుంది. దీని వ‌ల‌న బ్యాక్టీరియా, వైర‌స్‌లు చ‌నిపోయే అవ‌కాశం ఉంటుంది. అందుకే మ‌న‌మంద‌రం చ‌ప్ప‌ట్లు కొట్టి వైర‌స్‌ని కంట్రోల్ చేద్ధాం అన్నారు మోహ‌న్ లాల్. 

దీనిపై ఓ వ్యక్తి కేరళ మానవ హక్కుల కమిషన్‌లో మోహన్‌లాల్‌పై ఫిర్యాదు చేసినట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోహన్‌ లాల్ ఇలా ప్రచారం చేయడం సరికాదని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆ వ్యక్తి తెలిపారు. అయితే ఇప్పుడీ న్యూస్ ఫేక్ అని తేలింది. 

click me!