బిగ్ బాస్ లోకి తనుశ్రీదత్తా.. నిర్వాహకులకి వార్నింగ్!

By Udayavani DhuliFirst Published Oct 3, 2018, 4:53 PM IST
Highlights

తనుశ్రీదత్తా, నానా పటేకర్ ల వివాదం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నానాపటేకర్ తనను లైంగికంగా వేధించాడని చెప్పిన తనుశ్రీ ఎంఎన్ఎస్ పార్టీ నాయకులు నానా విషయంలో ఆమెపై దాడికి పాల్పడ్డారని, బెదించారని వెల్లడించింది. 

తనుశ్రీదత్తా, నానా పటేకర్ ల వివాదం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. నానాపటేకర్ తనను లైంగికంగా వేధించాడని చెప్పిన తనుశ్రీ ఎంఎన్ఎస్ పార్టీ నాయకులు నానా విషయంలో ఆమెపై దాడికి పాల్పడ్డారని, బెదించారని వెల్లడించింది.

దీనిపై స్పందించిన ఎంఎన్ఎస్ పార్టీ.. తనుశ్రీ చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదని.. ఆమెపై పార్టీ కార్యకర్తలు దాడి చేయలేదని స్పష్టం చేశారు. పబ్లిసిటీ కోసం ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ నిర్వాహకులకు ఎంఎన్ఎస్ పార్టీ ఓ లేఖ అందించింది.

తనుశ్రీకి వివాదానికి, బిగ్ బాస్ కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా..?బాలీవుడ్ లో నడుస్తోన్న బిగ్ బాస్ సీజన్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తనుశ్రీ వెళ్లబోతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

దీంతో తనుశ్రీని ఈ షోలోకి తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు బుధవారం బిగ్ బాస్ సెట్ కి వెళ్లి నిర్వాహకులకు ఓ లేఖ అందించారు.  తనుశ్రీని బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే.. హింస తప్పదని వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

click me!