నన్ను ప్రేమించినట్లు నటించాడు.. గుండె పగిలి ఏడ్చా.. హీరోయిన్ ఆవేదన!

Published : Oct 03, 2018, 03:53 PM IST
నన్ను ప్రేమించినట్లు నటించాడు.. గుండె పగిలి ఏడ్చా.. హీరోయిన్  ఆవేదన!

సారాంశం

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. ఇప్పటికీ ఆమె ఫిట్ నెస్ లో యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో 'హియర్ మి లవ్ మి'కి జడ్జిగా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ షోలో మాట్లాడుతూ.. తన ప్రేమ కథని గుర్తు చేసుకుంది.

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. ఇప్పటికీ ఆమె ఫిట్ నెస్ లో యంగ్ హీరోయిన్లకు పోటీగా నిలుస్తోంది. ప్రస్తుతం బుల్లితెర రియాలిటీ షో 'హియర్ మి లవ్ మి'కి జడ్జిగా వ్యవహరిస్తోంది.

తాజాగా ఈ షోలో మాట్లాడుతూ.. తన ప్రేమ కథని గుర్తు చేసుకుంది. ''ఓ అబ్బాయి రోజు సాయంత్రం మా ఇంటికి ఫోన్ చేసేవాడు. అప్పుడు నేను ఇంకా కాలేజ్ లో  చదువుకుంటున్నాను. ఆ వయసులో ఏ అమ్మాయైనా.. ఎట్రాక్ట్ అవుతుంది. నా పరిస్థితి కూడా అంతే.. అప్పుడు కేవలం ల్యాండ్ లైన్ ఫోన్లు మాత్రమే ఉండేవి.. అతడి ఫోన్ కోసం ఎదురు చూసేదాన్ని..

మా నాన్న ఇంటికి రాగానే ఫోన్ కట్ చేసేసేదాన్ని. ఆ అబ్బాయి తన పేరు కూడా నాకు చెప్పలేదు. ఒకరోజు బస్ స్టాప్ లో కలుద్దామని చెప్పాను. కానీ తను అక్కడకి రాలేదు. దీంతో అతడితో రిలేషన్ కి గుడ్ బై చెప్పాలనుకున్నా..

ఆ తరువాత తెలిసింది ఆ అబ్బాయి నా ఫ్రెండ్స్ తో బెట్ కట్టి నాతో ప్రేమ నాటకమాడాడని.. బెట్ లో గెలవడమే అతడి లక్ష్యంగా పెట్టుకున్నాడు. నాతో బంధాన్ని తెంచుకున్నాడు. ఆ సమయంలో నేను ఎంతో ఆవేదనకి గురయ్యాను. గుండె పగిలేలా ఏడ్చాను.. చాలా రోజులు ఆ బాధలోనే ఉండిపోయా'' అంటూ చెప్పుకొచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి