విజయ్ దేవరకొండ 'నోటా'కి కొత్త సమస్య.. హైకోర్టులో పిటిషన్!

By Udayavani DhuliFirst Published Oct 3, 2018, 4:32 PM IST
Highlights

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి సినిమాకు ఏవోక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించినప్పటి నుండి సినిమాకు ఏవోక అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సినిమాలో సన్నివేశాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మిగిలిన పార్టీలను దూషించే విధంగా ఉన్నాయంటూ వార్తలు వినిపించాయి.

అయితే అలా ఒక వర్గానికి ఫేవర్ గా ఈ సినిమా ఉండదని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటికే కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఈ సినిమా విడుదల ఆపాలని ఎలక్షన్ కమీషన్ అధికారి రజత్ కుమార్ ని కలిశాడు.

తాజాగా ఓయూ జేఏసీ నేత కైలాస్ బుధవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 'నోటా' అనే పదాన్ని టైటిల్ గా పెట్టే ముందు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరిగా  తీసుకోవాలని హైకోర్టుకి తెలిపారు.

తెలంగాణా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందునఎలక్షన్ కమీషన్ సినిమా చూసి అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే తొలగించిన తరువాతే సినిమా విడుదలకి అనుమతి ఇవ్వాలని కోరారు. మరి ఈ పిటిషన్ సినిమా విడుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి!

సంబంధిత వార్తలు.. 

సినిమా రిలీజ్ ఆపడానికి చాలా చేస్తున్నారు.. విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు!

నోటాపై విమర్శలు.. విజయ్ దేవరకొండ సౌండ్ లేదేంటి?

రెమ్యునరేషన్ గురించి విజయ్ దేవరకొండ మాటల్లో!

'నోటా' టీఆర్ఎస్ కి సపోర్టా..?

click me!