కౌశల్ ని కలవాలంటే న్యూడ్ ఫోటోలు పంపాలట!

By Udaya DFirst Published Mar 1, 2019, 12:52 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై కౌశల్ ఆర్మీ ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై స్పందించిన కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చాడు. 

బిగ్ బాస్ సీజన్ 2 విజేతగా నిలిచిన కౌశల్ పై కౌశల్ ఆర్మీ ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ ఆరోపణలపై స్పందించిన కౌశల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా ఆధారాలతో సహా మీడియా ముందుకొచ్చాడు.

ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఆశ్చర్యానికి గురి చేశాయి. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తరువాత అభిమానులు ఎక్కడకి పిలిస్తే అక్కడకి వెళ్లాననిమ చాలా మందిని కలిసి వచ్చానని.. అయితే దీనిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకున్నారని కౌశల్ చెప్పాడు.

కొందరు కౌశల్ ఆర్మీ సభ్యులు కౌశల్ ని అభిమానించే అమ్మాయిలతో తప్పుగా ప్రవర్తించినట్లు చెప్పారు. కౌశల్ ని కలిసే ఛాన్స్ కావాలంటే తమకి న్యూడ్ ఫోటోలు పంపాలని కౌశల్ ఆర్మీ సభ్యులు కొందరు అమ్మాయిలను వేధించారట. ఈ విషయం కౌశల్ కి తెలియడంతో వారిని మందలించాడట.

దీంతో వారు కౌశల్ కి వ్యతిరేకంగా మారి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని, నిజాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా చానెళ్లు వారితో చర్చలు  నిర్వహిస్తున్నారని కౌశల్ చెప్పారు. అలానే పవన్ కళ్యాణ్ పై తాను ఎలాంటి కామెంట్స్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు. 

click me!