పాడె మోసిన చిరు, చరణ్‌.. ఉమాపతిరావు అంత్యక్రియలు పూర్తి

By Satish ReddyFirst Published Jun 1, 2020, 11:59 AM IST
Highlights

దొమకొండ కోట వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కామినేని ఉమాపతి రావు అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచిన కుటుంబ సభ్యులు తరువాత స్థానిక ముత్యం పేట రోడ్డులోని లక్ష్మీబాగ్‌లో అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.

మెగా ఫ్యామిలీ బంధువు, మెగా కోడలు ఉపాసన తాత ఉమాపతిరావు ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు దోమకొడలో పూర్తయ్యాయి. దొమకొండ కోట వారసుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ఉంచిన కుటుంబ సభ్యులు తరువాత స్థానిక ముత్యం పేట రోడ్డులోని లక్ష్మీబాగ్‌లో అంతిమ కార్యక్రమాలు నిర్వహించారు.

ఆయన కుమారుడు అనిల్‌ కుమార్‌, కొడలు శోభన ఈ కార్యక్రమాలను నిర్వహించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న చిరంజీవి, రామ్ చరణ్‌లు పాడె మోశారు. ప్రైవేట్‌ సెక్యూరిటీ ఉమాపతిరావుకు గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరిపి నివాళులర్పించారు. అయితే అంత్యక్రియల్లో స్వల్ప అపశ్రుతి చోటు చేసుకుంది.

భవనంలో ఉన్న ఉమాపతిరావు పార్థివ దేహాన్ని బయటకు తీసుకువస్తుండగా ఒక్కసారిగా తేనెటీగలు దాడి చేశాయి. దీంతో అక్కడున్న వారంతా ఇంట్లోకి పరుగులు పెట్టారు. కొంతమందిని తేనెటీగలు కుట్టడంతో వారికి ప్రాథమిక చికిత్స అందించారు. ఈ ఘటనతో అంత్యక్రియలు కాస్త ఆలస్యమయ్యాయి.

click me!