అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో నాని `జెర్సీ`

By Satish ReddyFirst Published Jul 31, 2020, 4:27 PM IST
Highlights

పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఓడి  గెలిచిన తీరు హృద్యంగా ఈ 'జెర్సీ' చిత్రం రూపొందింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు 'జెర్సీ' ఎంపికయ్యింది.

భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు  'జెర్సీ' చిత్రం ఎంపికైంది. నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో యువ నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ` తెలుగునాట ఘన విజయం సాధించటమే కాక, పలు ప్రశంసలు అందుకుంది.

సంగీత దర్శకుడు అనిరుద్ 'జెర్సీ' చిత్రానికి తన సంగీతం తో ప్రాణం పోశారు. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం దర్శకత్వం ఈ చిత్రానికి మరో ఆకర్షణ గా నిలిచింది. పరాజితుడైన ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఒడి  గెలిచిన తీరు హృద్యంగా ఈ 'జెర్సీ' చిత్రం రూపొందింది. భారత అంతర్జాతీయ టొరంటో చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకు 'జెర్సీ' ఎంపికయ్యింది.

ఈ ఏడాది ఆగస్టు 9 నుంచి, 15 వరకు జరిగే ఈ చిత్రోత్సవంలో ఈ చిత్రం ప్రదర్శనకు నోచుకోవటం, ఈ విషయాన్ని మీడియాతో పంచుకోవటం తమ కెంతో సంతోషాన్ని కలిగిస్తోందని అన్నారు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. స్వాతంత్య్ర దినోత్సవ శుభ సమయంలో కెనడాలో ఈ వేడుక జరుగనుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనే ప్రముఖ బాలీవుడ్ హీరో 'షాహిద్ కపూర్' తో ఈ 'జెర్సీ' చిత్రం బాలీవుడ్ లో నిర్మితం కానున్న విషయం విదితమే.

click me!