రాయలసీమకు ఇమేజ్‌ తెచ్చిన విలక్షణ నటుడు జయప్రకాష్‌రెడ్డి

By Aithagoni RajuFirst Published Sep 8, 2020, 8:35 AM IST
Highlights

రాయలసీమ లాంగ్వేజ్‌కి వెండితెర రూపం ఇచ్చిన ఆయన విలనిజానికి ఓ ఇమేజ్‌ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే. 

విలనిజానికి కొత్త అర్థం చెప్పిన విలక్షణ నటుడు జయప్రకాష్‌ రెడ్డి హఠాన్మరణం టాలీవుడ్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది. రాయలసీమ లాంగ్వేజ్‌కి వెండితెర రూపం ఇచ్చిన ఆయన విలనిజానికి ఓ ఇమేజ్‌ని తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే. 

కర్నూలు జిల్లా, ఆళ్లగడ్డ మండలం శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన జయప్రకాష్‌రెడ్డి తండ్రి సాంబిరెడ్డి. ఆయన ఎస్‌ఐగా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఒకటి నుంచి ఐదవ తరగతి వరకు చదివాడు. నెల్లూరులోని రంగనాయకులపేలోని ఉన్నత పాఠశాలలో చేరాడు. జయప్రకాష్‌ రెడ్డి టెన్త్ చదివే సమయంలోనే వాళ్ళ నాన్నకి అనంతపురం బదిలి అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్‌ హైయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో ఎస్‌ఎన్‌ఎల్‌సీలో చేరాడు. 

చిన్నప్పట్నుంచి నాటకాలంటే ఇష్టం. తండ్రి కూడా నటుడే కావడంతో జయప్రకాష్‌ రెడ్డికి అడ్డంకులేవీ రాలేదు.తండ్రీ కొడుకుల కలిసి నాటకాల్లో పాల్గొనడం విశేషం. డిగ్రీ పూర్తి చేసి మ్యాథ్స్ టీచర్‌గానూ పనిచేశారు. 

అనంతపురంలో చదువుకునే టైమ్‌లో టీచర్‌ ముందు దుర్యోధన గర్వ భంగం` అనే నాటికలో పద్యాలు, డైలాగులు ట్టీ కొట్టేసి అప్పజెప్పమనగా,టపటపా చెప్పేశారు. కానీ ఓ చిన్న తప్పు రావడంతో టీచర్‌ వీరిని బాగా మందలించారు. దాన్ని జయప్రకాష్‌ రెడ్డి చాలా సీరియస్‌గా తీసుకున్నారు. నాటకాలపై పట్టు సాధించే వరకు కసరత్తులు చేశారు. ఆ కసితోనే నటన రంగంలోకి అడుగుపెట్టారు. 

జయప్రకాష్‌రెడ్డి ఓ సారి నల్గొండలో `గప్‌చుప్‌` అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకి పరిచయం చేశారు. అలా 1988లో విడుదలైన `బ్రహ్మపుత్రుడు` సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 

మొదట పలు డిఫరెంట్‌ రోల్స్ చేసిన ఆయన `1997లో వచ్చిన `ప్రేమించుకుందాం రా` చిత్రంతో విలన్‌గా మారాడు. ఈ సినిమాతో విలన్‌గా మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా వచ్చిన `సమరసింహారెడ్డి`, `నరసింహానాయుడు` చిత్రాలు విలన్‌గా ఆయనకు స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చాయి. అంతేకాదు రాయలసీమ యాసకి ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, ఇమేజ్‌ని తీసుకొచ్చారు. 

click me!