'బిగ్ బాస్ 3' లో హాట్ హీరోయిన్.. కుర్రాళ్లకు కిక్కే కిక్కు!

By AN TeluguFirst Published Jul 8, 2019, 2:24 PM IST
Highlights

బిగ్ బాస్ 3 తెలుగు సీజన్... టీవీ తెరపైనే మోస్ట్ వెయిటింగ్ షో గా మారిన సంగతి తెలిసిందే. 

 

బిగ్ బాస్ 3 తెలుగు సీజన్... టీవీ తెరపైనే మోస్ట్ వెయిటింగ్ షో గా మారిన సంగతి తెలిసిందే.  ఈ షో  ఎప్పుడు మొదలవుతుందా అని కోట్ల మంది  అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ షోకి... టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తుండటంతో ఓ రేంజిలో హైప్ క్రియేట్ అయ్యింది.  

అలాగే యాంకర్ శ్రీముఖి సహా క్రేజీ సెలబ్రెటీలు చాలా మంది కంటెస్టెంట్లు టాక్ నడుస్తూండటంతో ఈసారి షో ఎలా సాగుతుందన్నదానిపై ఎక్సపెక్టేషన్స్  బాగా పెరిగాయి.  అదే సమయంలో  ఈ షో పై రకరకాల రూమర్లు, వాదనలూ మొదలయ్యాయి. తాజాగా ఈ షోలో తెలుగులో హాట్ గా పేరు తెచ్చుకున్న  ఓ హీరోయిన్ పేరు సైతం వినపడుతోంది. 

కుమారి 21 ఎఫ్ చిత్రంతో పాపులర్ అయిన హెబ్బా పటేల్ బిగ్ బాస్ లో ప్రవేశించబోతోందంని, సెంటరాఫ్ ఎట్రాక్షన్ కాబోతోందని వినికిడి. తాను వరస సినిమాలో బిజిగా ఉన్నా కొట్టిపారేసినా, హఠాత్తుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఆమె వస్తోందని ఛానెల్ వాళ్లు ఆ విషయం సీక్రెట్ గా ఉంచమన్నారని తెలుస్తోంది. అయితే హెబ్బా పటేల్ ని ఛానెల్ వాళ్లు ఈ షో  కోసం సంప్రదించింది నిజమే అని, అయితే రెమ్యునేషన్ విషయం దగ్గర ఇంకా లాక్ కాలేదని కొందరంటున్నారు. ఏది నిజమో కానీ , హెబ్బా పటేల్ వస్తే మాత్రం షోకు మంచి క్రేజ్ వస్తుందనేది నిజం. అందరి అటెన్షన్ ఈ షోపైనే ఉంటుందనేది మరింత నిజం. 

ఇక ఆల్రెడీ ఇప్పటికే ఒక ప్రోమోలో నటించిన నాగార్జున... మిగతా ప్రోమోల షూటింగ్‌లో బిజీ అయిపోయారు. జులై 21న తొలి షో  ఉండబోతోంది. ఈ వీకెండ్ నాటికి కంటెస్టెంట్లు ఎవరన్నది తేలుతుంది. అప్పుడే షో డేట్ కూడా అఫీషియల్‌గా ప్రకటిస్తారు.

click me!