గోపీచంద్ సినిమాకు అల్లు అర్జున్ టైటిల్!

Published : Sep 27, 2019, 05:05 PM ISTUpdated : Sep 27, 2019, 05:07 PM IST
గోపీచంద్ సినిమాకు అల్లు అర్జున్ టైటిల్!

సారాంశం

'యూ టర్న్‌' చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభి స్తున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెప్పారు. గోపీచంద్‌ హీరోగా నటించే ఈ భారీ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తారు.

'అల్లు అర్జున్‌ హీరోగా, హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన 'దువ్వాడ జగన్నాథమ్‌' చిత్రంలోని 'సీటీ మార్‌.. సీటీ మార్‌..' అనే సాంగ్‌ ఎంతగా పాపులర్‌ అయ్యిందో తెలిసిందే. ఈ పాటలోని 'సిటీమార్‌' పదాన్ని టైటిల్‌ తో  గోపీచంద్ నెక్ట్స్‌ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు దర్శకుడు సంపత్ నంది. వీరిద్దరు కలిసి గతంలో గౌతమ్ నంద సినిమాని చేసారు. అసలు హరీష్ శంకరే గతంలో ఈ టైటిల్ తో ఈ సినిమాని ప్లాన్ చేసారు.

'యూ టర్న్‌' చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ త్వరలో కొత్త చిత్రాన్ని ప్రారంభి స్తున్నట్లు నిర్మాత శ్రీనివాసా చిట్టూరి చెప్పారు. గోపీచంద్‌ హీరోగా నటించే ఈ భారీ చిత్రానికి సంపత్‌ నంది దర్శకత్వం వహిస్తారు.  అలాగే శ్రీనివాస చిట్టూరి గతంలో రవితేజతో ఓ చిత్రాన్ని నిర్మించారు. గోపీచంద్‌ చిత్రం భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిస్తున్నట్లు నిర్మాత అన్నారు. ఈ ప్రెస్టీజియస్‌ మూవీకి సంబంధించిన అన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని ఆయన అన్నారు.

అలాగే ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్‌గా ఎంపికైంది. తమన్నా గతంలో సంపత్ నంది దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ‘బెంగాల్ టైగర్’లో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నాను ఎంపిక చేసినట్లుగా చిత్రయూనిట్ అఫీషియల్‌గా ప్రకటించింది. గోపీచంద్, తమన్నా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ఈ చిత్రానికి సమర్పణ: పవన్ కుమార్ ; నిర్మాత: శ్రీనివాసా చిట్టూరి; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్ నంది

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?