పవన్, మహేష్, రవితేజ్ ల క్రాస్ విజయ్ దేవరకొండ... వర్మ సంచలన ట్వీట్స్!

By team teluguFirst Published Jul 19, 2021, 2:58 PM IST
Highlights

పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటిసారి ఫైటర్ రోల్ చేస్తున్నారు. 

విజయ్ దేవరకొండ లైగర్ మూవీకి దర్శకుడు వర్మ తన మార్క్ ప్రొమోషన్స్ మొదలుపెట్టారు. లైగర్ మూవీని ఉద్దేశిస్తూ ఆయన చేసిన కొన్ని ట్వీట్ సంచలనంగా మారాయి. అసలు రెండు దశాబ్దాలలో విజయ్ దేవరకొండ లాంటి హీరోయిని చూడలేదని వర్మ అంటున్నారు. 


పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్ లో మొదటిసారి ఫైటర్ రోల్ చేస్తున్నారు. ఈ మూవీ కోసం విజయ్ దేవరకొండ విదేశాలలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. కొన్ని యుద్ధ విద్యలను ఆయన నేర్చుకోవడం జరిగింది. 


కాగా ఈ మూవీని చూశానని అంటున్న వర్మ విజయ్ దేవరకొండతో పాటు దర్శకుడు పూరి, నిర్మాతలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఓ ట్వీట్ లో.. పవన్, మహేష్, రవితేజ, టైగర్ ష్రాఫ్ వంటి హీరోల క్రాస్ బ్రీడ్ గా విజయ్ దేవరకొండ కనిపిస్తున్నారని ట్వీట్ చేశారు. 

Saw scenes of presented directed and produced LIGER ..More than a CROSS between TIGER and LION looks like a SUPER CROSS between and

— Ram Gopal Varma (@RGVzoomin)

మరో ట్వీట్ లో.. విజయ్ దేవరకొండ స్క్రీన్ ప్రెజన్స్ అద్భుతం, గత రెండు దశాబ్దాలలో ఇలాంటి స్టార్ ని చూడలేదని, విజయ్ లోని పవర్ ని వెలికి తీసిన పూరి, ఛార్మిలకు ధన్యవాదాలు... అంటూ ట్వీట్ చేశారు. 

The SCREEN PRESENCE of in LIGER Is GREATER than any STAR i have seen in the last 2 DECADES..Thank you and for bringing it out 🙏

— Ram Gopal Varma (@RGVzoomin)


తన శిష్యుడు పూరి చిత్రం కోసం వర్మ ఈ విధంగా ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక ఇస్మార్ట్ శంకర్ మూవీతో ఫార్మ్ లోకి వచ్చిన పూరి నుండి వస్తున్న తదుపరి చిత్రం లైగర్. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సహ భాగస్వామిగా తెరకెక్కిన ఈ మూవీలో అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. 
 

click me!