మేము అనుకున్న దానికంటే మంచి రిజల్ట్ వచ్చింది : దిల్ రాజు (వీడియో)

Dec 17, 2018, 5:00 PM IST

హుషారు గత శుక్రవారం రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. ముందుగా సినిమాపై అంచనాలు ఏమీ లేనప్పటికి మొదటి ఆట నుండి ప్రేక్షకులు నుండి మంచి టాక్ స్ప్రెడ్ అవడంతో కలెక్షన్లు కూడా బాగా పుంజుకుంది. ఈ సందర్భంగా దిల్ రాజు, సినిమా టీమ్ తమ సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.