1 కి.మీకి 25 పైసాలు.. సామాన్యుల కోసం సబ్సిడీ కింద అతితక్కువ ధరకే స్పోర్ట్స్ బైక్..

First Published May 7, 2024, 4:19 PM IST

భారతీయ బ్రాండ్ ఒకాయ(Okaya) అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ఫెర్రాటో డిస్‌రప్టర్‌ను(Ferrato Disruptor)   లాంచ్  చేసింది. మీరు ఢిల్లీలో  ఈ బైక్ సబ్సిడీ తర్వాత రూ. 1.40 లక్షలకు లభిస్తుంది.
 

దీని లుక్స్ చాలా స్పోర్టీగా ఉంటుంది. ఈ బైక్ ఫుల్ ఛార్జింగ్ పై 129 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఎందుకంటే ఇందులో 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. అంతేకాదు ఫుల్ ఛార్జ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది.
 

ఈ ఎలక్ట్రిక్ బైక్ గంటకు 95 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లగలదు. ఫెర్రాటో డిస్‌రప్టర్ అనేది ఒక ఎలక్ట్రిక్ బైక్. దీని నిర్వహణ ఖర్చు చాలా తక్కువ. ఒక్కసారి ఫుల్ ఛార్జీ చేయడానికి మీకు సుమారు రూ.32 ఖర్చవుతుంది.
 

అంటే రూ.32తో 129 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ విధంగా చూస్తే కిలోమీటరుకు 25 పైసలు మీరు చెల్లిస్తున్నట్లు. ఇంకా పెట్రోల్ కంటే చాలా తక్కువ ధర. కంపెనీ తాజాగా బుకింగ్స్ కూడా  ప్రారంభించింది.
 

3 నెలల తర్వాత డెలివరీలు ప్రారంభమవుతాయి. అయితే ఈ బైక్ చాలా ఖరీదైన బైక్ కాదు. Okaya  కొత్త ఎలక్ట్రిక్ బైక్ IP67 రేటింగ్‌ పొందింది. కంపెనీ 3 సంవత్సరాలు లేదా 30,000 కిలోమీటర్ల వరకు వారంటీని కూడా అందిస్తుంది.
 

click me!