శివసేనతో సై: ముంబైలో అడుగుపెట్టే వ్యూహాలు.. సీఆర్‌పీఎఫ్, ఐబీ అధికారులతో కంగనా భేటీ

By Siva KodatiFirst Published Sep 8, 2020, 3:57 PM IST
Highlights

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ , సినీ నటి కంగనా రనౌత్ ఈ నెల 9న ముంబై పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు గాను కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల డిప్యూటీ కమాండెంట్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), హిమాచల్ ప్రదేశ్ పోలీసు అధికారులు మంగళవారం మనాలీలోని ఆమె నివాసాన్ని సందర్శించారు.

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ , సినీ నటి కంగనా రనౌత్ ఈ నెల 9న ముంబై పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు గాను కేంద్ర రిజర్వ్ పోలీస్ బలగాల డిప్యూటీ కమాండెంట్, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), హిమాచల్ ప్రదేశ్ పోలీసు అధికారులు మంగళవారం మనాలీలోని ఆమె నివాసాన్ని సందర్శించారు.

శివసేన నుంచి బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఆమెకు వై కేటగిరీ భద్రతను కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.

ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పోలుస్తూ కంగనా చేసిన ప్రకటనపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇదే సమయంలో తాను ఈ నెల 9న ముంబైలో అడుగుపెడతానని.. దమ్ముంటే అడ్డుకోవాలని కంగనా రనౌత్ సవాల్ విసిరారు.

ఈ వ్యవహారంలో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఆమెకు మద్ధతుగా నిలిచారు. కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ ముద్ధు బిడ్డని అన్నారు. ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కంగనా తండ్రి రాసిన లేఖపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని సీఎం ఆదేశించారు.

ఇందుకు సంబంధించిన కంగనా రనౌత్ ఇంటి వద్ద పోలీసు భద్రతను పెంచినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ముంబై చేరుకోనున్నన్న కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు క్వారంటైన్ పేరుతో నిర్బంధించవచ్చని వార్తలు వస్తున్నాయి.

మీడియా కథనాల ప్రకారం, ముంబై చేరుకున్న కంగనా రనౌత్‌ను 7 రోజుల పాటు నిర్బంధించడానికి బిఎంసి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు కంగనాను ఉద్దేశిస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సంజయ్ రౌత్ అందుకు క్షమాపణలు చెప్పనప్పటికి.. తాను పోరపాటు చేసి వుండొచ్చని ఓ జాతీయ ఛానెల్‌తో అన్నారు.

కంగనా కూడా తప్పులు చేసిందన్న ఆయన.. తాము ఎన్నోసార్లు చూశామని అన్నారు. ముంబై పోలీసులు, పరిపాలనపై ఆమెకు నమ్మకం లేకపోతే ఆమె ఇక్కడ ఉండటం ఎందుకని సంజయ్ ప్రశ్నించారు.

మరోవైపు కంగనా రనౌత్‌కు వై ప్లస్ కేటగిరీ భద్రత కల్పించడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై రౌత్ మండిపడ్డారు. ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర గురించి, ముంబాదేవికి చెందిన ముంబై గురించి అవమానకరమైన భాషలో మాట్లాడే వ్యక్తికి భద్రత ఇవ్వడం సరైనదని భావిస్తే అలాగే ఉండండని అన్నారు. 

click me!