ఆ విషయం చెప్పి కొరటాలను ఇబ్బందుల్లో పడేసాడు!

By Surya PrakashFirst Published Apr 6, 2020, 7:08 AM IST
Highlights

ఓ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌రోనాతో పాటు కొరటాల పర్శనల్ జీవితానికి సంభిదించిన విష‌యాల‌పై ఆయ‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుగు వాళ్లలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొరటాల పై గౌరవం అమాంతం రెట్టింపు చేసాయి. 

‘ఆచార్య’ సినిమా దర్శకుడు కొరటాల శివ ని ఆకాశానికి ఎత్తేసారు చిరంజీవి. ఇంత వ‌ర‌కూ కొరటాల గురించి బయిట ప్రపంచానికి తెలియని విషయాలను ఆయన రివీల్ చేసారు.  ఓ దిన‌ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌రోనాతో పాటు కొరటాల పర్శనల్ జీవితానికి సంభిదించిన విష‌యాల‌పై ఆయ‌న మ‌న‌సులో మాట బ‌య‌ట‌పెట్టారు. ఆ విశేషాలు ఇప్పుడు తెలుగు వాళ్లలో ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొరటాల పై గౌరవం అమాంతం రెట్టింపు చేసాయి. 

అయితే కొరటాల శివ మాత్రం ఇలా తన పర్శనల్ లైఫ్ విషయాలను బయిటకు చిరు రివీల్ చేయటం మాత్రం ఊహించలేదట. ఇన్నాళ్లు తన కుటుంబ సభ్యుల వరకే తెలిసిన విషయాలు ఇప్పుడు ప్రపంచానికి తెలియటం ఆయనికి ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. చాలా మంది ఆయనకు ఫోన్ చేసి మెచ్చుకుంటున్నారని, అది మరింత ఇబ్బందికర వాతావరణం కలగచేస్తోందని చెప్తున్నారు. ఇంతకీ చిరంజీవి చెప్పి ఆ విషయాలేంటో చూద్దాం.

చిరంజీవి మాట్లాడుతూ..‘కొర‌టాల శివ, ఆయన భార్య ఈ సమాజంపై భాధ్యత కలిగిన వ్యక్తలు. వాళ్లు తమ సంపాదనలో కొంత భాగాన్ని సమాజం లో అవసరం ఉన్నవాళ్ల కోసం ఖర్చు పెడుతూంటారు. ఇద్దరు చాలా గొప్ప విలువలు ఉన్న మనుష్యులు. పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమని... బిడ్డలు వద్దనుకున్న గొప్ప జంట. అంటూ కొరటాల దంపతులను చిరంజీవి కొనియాడారు.

ఇక కొరటాల వ్యక్తిగతంగా తమ  సమాజం పట్ల ఎంతో అవగాహన, మేధస్సు ఉన్న వ్యక్తి. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై పట్టున్నాడు. దిగజారుతున్న రాజకీయలు, నాయకుల వ్యక్తిత్వాలు-ప్రవర్తన గురించి అతనిలో ఆందోళన ఎక్కువ. డబ్బు తీసుకుని ఓట్లు వేస్తున్న ప్రజల గురించి వ్యధతో మాట్లాడతాడు. . కొరటాల శివలోని సేవాతత్పరత తనకు ఎంతో నచ్చింది.  గొప్ప వ్యక్తిత్వం, సామాజిక స్పృహ ఉన్న తనతో సినిమా చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. అతని చిత్రాల్లో ఆ భావాలు కనపడతాయి’ అని చిరంజీవి చెప్పారు.

 కొరటాల వరస సినిమాలు ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’, ‘జనతాగ్యారేజ్’, ‘భరత్ అనే నేను’ లలో  కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక అంశాలను ప్రస్తావిస్తూ.. వస్తున్నారు.. ఆయన సంపాదనలో సగానికిపైగా పలు మఠాలకు, స్వచ్చంద సంస్థలకు ఇచ్చేస్తున్నారు.
 

click me!