తాలిబన్లకు మద్ధతుగా పలువురు భారతీయ ముస్లింలు.. బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహం

By Siva KodatiFirst Published Sep 2, 2021, 8:25 PM IST
Highlights

తాలిబన్లను సమర్థిస్తున్న భారతీయ ముస్లింలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్లాంను సంస్కరించి, ఆధునికతకు మద్దతివ్వాలో, లేదంటే, ఆటవిక, అనాగరిక, క్రూరమైన సంప్రదాయాలు, విలువలతో కలిసి జీవించాలో భారతీయ ముస్లింలు తమను తాము ప్రశ్నించుకోవాలని నసీరుద్దన్ షా హితవు పలికారు.

తాలిబన్లను సమర్థిస్తున్న భారతీయ ముస్లింలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడం ప్రపంచానికి ఆందోళనకరమని .. కానీ భారతీయ ముస్లింలలోని కొన్ని వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయని ఆయన మండిపడ్డారు. నసీరుద్దీన్ షా వ్యాఖ్యలను కొందరు సమర్ధిస్తుండగా.. మరికొందరు విమర్శలకు దిగారు. ఆఫ్ఘన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంపై ప్రపంచమంతా ఆందోళన  చెందుతోందని షా అన్నారు.

Also Read:ఆఫ్గన్ కొత్త ప్రభుత్వానికి కూడా హైబతుల్లా అఖుంజాదానే సుప్రీం లీడర్.. ప్రకటించిన తాలిబన్లు..

అటవికుల సంబరాలు తక్కువ ప్రమాదకరమేమి కాదని నసీరుద్దన్ షా వ్యాఖ్యానించారు. తాలిబన్లు ఖచ్చితంగా ఓ శాపమని ఆయన అన్నారు. ఇస్లాంను సంస్కరించి, ఆధునికతకు మద్దతివ్వాలో, లేదంటే, ఆటవిక, అనాగరిక, క్రూరమైన సంప్రదాయాలు, విలువలతో కలిసి జీవించాలో భారతీయ ముస్లింలు తమను తాము ప్రశ్నించుకోవాలని నసీరుద్దన్ షా హితవు పలికారు. భారతీయ ముస్లింలు పాటించే ఇస్లాంను, ఇతర దేశాలవారు పాటించే ఇస్లాంను పోల్చి చెప్పారు. ‘హిందుస్థానీ ఇస్లాం’ ఎల్లప్పుడూ ప్రత్యేకమైనదని చెప్పారు.

click me!