నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘యన్.టి.ఆర్.’ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ ఎక్సపెక్టేషన్స్ తో రచ్చ చేసింది.
నందమూరి తారక రామారావు జీవితాధారంగా ఆయన కుమారుడు బాలకృష్ణ టైటిల్ రోల్ పోషించిన చిత్రం ‘యన్.టి.ఆర్.’ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ ఎక్సపెక్టేషన్స్ తో రచ్చ చేసింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి భాగం ‘కథానాయకుడు’ ఈ నెల 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే సక్సెస్ కాలేకపోయింది. దాంతో ఇప్పుడు అందరి దృష్టీ రెండో భాగం ‘మహానాయకుడు’పై పడింది. బాలకృష్ణ కంటిన్యుగా ఈ రెండో పార్ట్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తొలి భాగం షూటింగ్ లో చాలా ఎనర్జీగా,కాన్ఫిడెంట్ గా పాల్గొన్న బాలయ్య ..రెండో పార్ట్ కు వచ్చేసరికిఅందుకు పూర్తి భిన్నంగా ఉన్నారట.
బాలయ్యని తొలి భాగం రిజల్ట్ మానసికంగా ఇబ్బంది పెట్టిందంటున్నారు. అయితే ఆయన టీమ్ లో ఎవరినీ ఈ విషయమై చిన్న మాట అనలేదు కానీ, ఆ అసహనం మాత్రం కనపడుతోందని చెప్పుకుంటున్నారు.
ఎప్పుడూ కూల్ గా ఓర్పుగా ఉండే బాలయ్య చాలా చిరాగ్గా ఉంటున్నారట. అయితే వృత్తిని దైవం లా భావించే ఆయన షూటింగ్ లో మాత్రం దాన్ని కనపడనివ్వటం లేదట. ఎప్పుడూ తన ప్రాజెక్టు గురించి తన సన్నిహితులతో, ఫ్రెండ్స్ తో మాట్లాడే బాలయ్య ఈ సారి సైలెంట్ అయ్యిపోయారట. క్రిష్ మాత్రం ఇవన్ని చూసి చూడనట్లుగా తన వర్క్ పై ఆ ప్రభావం పడకుండా పనిచేసుకుని పోతున్నట్లు తెలుస్తోంది.
ఎన్.బి.కె ఫిల్మ్స్, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఫస్ట్ పార్ట్ ‘కథానాయకుడు’లో ఎన్టీఆర్ సినీ ప్రస్థానం నుంచి తెలుగుదేశం పార్టీ ప్రకటన వరకూ చూపించారు.
సెకండ్ పార్ట్ ‘మహానాయకుడు’లో ఆయన ఎలా పార్టీని స్థాపించారు? ప్రజాదరణతో ఎలా ముఖ్యమంత్రి అయ్యారు? తదితర పరిణామాలను చూపించనున్నారు. తొలి భాగంతో పోలిస్తే, రెండో భాగంపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా చంద్రబాబునాయుడు పాత్రలో రానా ఈ రెండవ భాగంలో ఎక్కువ సేపు కనపడతారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ తేదీని ఇప్పటికే ఖరారు చేసింది.
సంబంధిత వార్తలు..
బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..
కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం
ఎన్టీఆర్ 'కథానాయకుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...
ఎన్టీఆర్ 'కథానాయకుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం
ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!
ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!
వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్
బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!
బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!
ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!
ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?
ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!
ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?
'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!
ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?
‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే