రెమ్యునరేషన్ లో హీరోని బీట్ చేసిందట!

By Udayavani DhuliFirst Published Jan 29, 2019, 11:47 AM IST
Highlights

సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు బాగా తగ్గుతుంటాయి. కానీ టాలీవుడ్ బ్యూటీ సమంతకు మాత్రం ఆ విషయంలో లోటు లేదు. వివాహమనంతరం సినిమాల పట్ల ఆమె ఆలోచనా విధానం బాగా మారింది. 

సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు బాగా తగ్గుతుంటాయి. కానీ టాలీవుడ్ బ్యూటీ సమంతకు మాత్రం ఆ విషయంలో లోటు లేదు. వివాహమనంతరం సినిమాల పట్ల ఆమె ఆలోచనా విధానం బాగా మారింది.

కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా కాకుండా సరికొత్త కథలను ఎన్నుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ' రీమేక్ లో నటిస్తోంది. అలానే తన భర్త నాగచైతన్యతో కలిసి 'మజిలీ' అనే సినిమా చేస్తోంది. రీసెంట్ గా '96' రీమేక్ లో నటించడానికి అంగీకరించిందని టాక్.

ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నాడు. తెరపై శర్వా, సమంతల కాంబినేషన్ ఫ్రెష్ నెస్ ని తీసుకొస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సమంత చాలా ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో హీరో కంటే సమంతకే ఎక్కువ ఇస్తున్నట్లు సమాచారం.

సాధారణంగా శర్వానంద్ ఒక్కో సినిమాకు రెండు నుండి రెండున్నర కోట్లు తీసుకుంటూ ఉంటాడు. కాస్త పేరున్న సినిమాలకు మూడు కోట్లకు పైగానే తీసుకుంటాడు. ఇప్పుడు శర్వా కంటే ఎక్కువగా సమంతకు పారితోషికం ఇస్తున్నారట. మొత్తానికి తన హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ హాట్ టాపిక్ గా మారింది సమంతా. 

click me!