మహేష్ బాబు 'మహర్షి' ఫోటోలు లీక్!

Published : Jan 29, 2019, 12:07 PM IST
మహేష్ బాబు 'మహర్షి' ఫోటోలు లీక్!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు 'మహర్షి' సినిమా షూటింగ్ ప్రస్తుతం పొల్లాచిలో జరుగుతోంది. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

పల్లెటూరి ప్రాంతంలో చిత్రీకరణ జరుపుతుండడంతో మహేష్ ని చూడడానికి జనాలు ఎగబడ్డారు. వారిని అదుపు చేయలేకపోవడంతో ఇటువంటి పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. కొందరు ఔత్సాహికులు షూటింగ్ కి సంబంధించిన వీడియోను తీశారు.

మహేష్ మీడియాతో మాట్లాడే సన్నివేశానికి సంబంధించిన ఫోటో లీకైంది. ఈ ఫోటోలను మహేష్ అభిమానులే షేర్ చేస్తుండడం గమనార్హం. ఈ సినిమాలో మహేష్ గుబురు గడ్డంతో కనిపించబోతున్నారు.

వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది, దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు