సెక్స్ ఎడ్యుకేషన్ పై అక్షయ్ సినిమా, డిటేల్స్

By Surya PrakashFirst Published Dec 6, 2022, 5:48 PM IST
Highlights

మరొక చిత్రం సెక్స్ ఎడ్యుకేషన్ మీద చేయబోతున్నారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ స్వయంగా తెలియచేసారు.
 

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ (Akshay Kumar)బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ అభిమానులకు కావాల్సిన ఎంటర్‌టైన్‌ మెంట్‌ అందించే ప్రయత్నంలో ఎప్పుడూ ముందుంటాడు ‌. ఈ హీరో నటిస్తోన్న తాజాగా రెండు సినిమాలు కమిటై మొదలెట్టారు. అందులో ఒకటి మరాఠి చిత్రం Vedat Marathe Veer Daudle Saat. మంగళవారం ముంబైలో షూటింగ్ ప్రారంభమైంది. అలాగే మరొక చిత్రం సెక్స్ ఎడ్యుకేషన్ మీద చేయబోతున్నారు.  ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ స్వయంగా తెలియచేసారు.

 "నేను సోషల్ ఫిల్మ్స్ లు చేయటంలో ఆసక్తి చూపిస్తూంటాను.  ప్రతీ ఒక్కరి జీవితంలో ఉపయోగపడేవి..నా దేశం లో విషయాలు గురించి చిత్రాలు ఉంటాయి.  ,"  అన్నారు.  ఈ సినిమా స్క్రిప్టు వర్క్ జరుగుతోందని  చెప్పారు. నిజ జీవిత సంఘటనలు బేస్ చేసుకుని నా కథలు రెడీ అవుతాయి. కమర్షియల్ గా నా చిత్రాలు ఉంటాయి. పాటలు, కామెడీ, డ్రామా, ట్రాజిడీ నా సినిమాల్లో ఉంటుంది. నేను చేసే సినిమాలు సమాజాన్ని ప్రతిబింబించేలా చూసుకుంటాను అన్నారు. 

మరో ప్రక్క పీరియాడిక్‌ ఫిల్మ్‌గా వస్తున్న ఈ చిత్రానికి మహేశ్ మంజ్రేకర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. లెజెండరీ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌ పాత్రలో నటిస్తున్నాడు. కాగా మేకర్స్ తాజాగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. రాజసం ఉట్టిపడేలా శివాజీ మహరాజ్ కాస్ట్యూమ్స్ లో నడుచుకుంటూ వస్తున్న వీడియోను అక్షయ్‌కుమార్‌ సోషల్ మీడియాలో షేర్ చేయగా.. నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

ఈ చిత్రంలో జయ్‌ డుధనే, ఉత్కర్స షిండే, విశాల్‌ నికమ్‌, విరాట్‌ మడ్కే, హార్థిక్‌ జోషి, సత్య, అక్షయ్‌, నవాబ్‌ ఖాన్‌, ప్రవీణ్‌ తార్డే ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వసీమ్‌ ఖురేషి నిర్మిస్తున్న ఈ చిత్రం 2023 దీపావళి కానుకగా మరాఠితోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
 

click me!