`న్యూడ్‌ ఆడిషన్‌`పై రాజ్‌కుంద్రా గురించి షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన మోడల్‌..

By Aithagoni RajuFirst Published Jul 20, 2021, 12:37 PM IST
Highlights

శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రాకి సంబంధించిన షాకింగ్‌ విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా మోడల్‌, నటి సాగరిక సోనా తన చేదు అనుభవాలను పంచుకుంది. న్యూడ్‌గా కనిపించాలని వారు డిమాండ్‌ చేయడం షాక్‌కి గురి చేసిందన్నారు.

శిల్పాశెట్టి భర్త, ఐపీఎల్‌ (రాజస్థాన్‌ రాయల్స్) టీమ్‌ హోనర్‌ రాజ్‌ కుంద్రా పోర్న్‌ చిత్రాల నిర్మాణానికి సంబంధించిన కేసులో సోమవారం రాత్రి అరెస్ట్ అయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ కేసు దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో రాజ్‌కుంద్రాకి సంబంధించిన మరిన్ని ఆగడాలు బయటకొస్తున్నాయి. తవ్వేకొద్ది డొంక కదిలినట్టు ఆయనకు సంబంధించిన షాకింగ్‌ విషయాలు వెల్లడవుతున్నాయి. తాజాగా మోడల్‌, నటి సాగరిక సోనా తన చేదు అనుభవాలను పంచుకుంది. 

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో తనకు వెబ్‌ సిరీస్‌లో ఆఫర్‌ అంటూ కాల్‌ వచ్చిందట. న్యూడ్‌గా కనిపించాలని వారు డిమాండ్‌ చేయడం షాక్‌కి గురి చేసిందని చెప్పింది సాగరిక. ఆమె ఇంకా చెబుతూ, లాక్ డౌన్ సమయంలో నాకు వెబ్ సిరీస్ లో ఆఫర్ వచ్చింది. దానికి సంబంధించి ఆడిషన్  చేయాలంటూ రాజ్ కుంద్రా సిబ్బంది కాల్ చేశారు. కరోనా సమయం కావడంతో వీడియో కాల్ లో ఆడిషన్ చేయాలన్నారు. అయితే వీడియో కాల్ లో న్యూడ్ ఆడిషన్ చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో నేను ఆ విషయాన్ని తిరస్కరించారు. ఆ కాల్‌లో ముగ్గురు వ్యక్తులున్నారు. అందులో రాజ్ కుంద్రా కూడా ఉన్నారు. కానీ మొహం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు రాజ్ కుంద్రా అరెస్ట్ అయ్యారని తెలిసి దైర్యంగా బయటకు వచ్చా. ఇకపై ఇలాంటివి జరగకుండా చూడాలి` అని తెలిపింది సాగరిక. 

ఇలా ఒక్కొక్కరు బయటకు రావడంతో రాజ్‌కుంద్రా చుట్టు ఉచ్చు మరింతగా బిగుసుకుంటోంది. వెబ్‌సిరీస్‌ పేరుతో ఆఫర్లు ఇస్తూ, న్యూడ్‌, సెమీ న్యూడ్‌ వీడియోలు తీస్తూ వాటిని పలు సైట్ల ద్వారా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేస్తున్నట్టు ఆరోపణల నేపథ్యంలో రాజ్‌కుంద్రాని ముంబయి పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.  రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాలు నిర్మిస్తున్నారనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

గతంలోనూ రాజ్ కుంద్రా పై పలు ఆరోపణలు వచ్చాయి. గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు రాజ్ కుంద్రా సహ యజమానిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2013 సీజన్ లో బయటపడ్డ మ్యాచ్ ఫిక్సింగ్ లో రాజ్ కుంద్రాపై కూడా ఆరోపణలు వచ్చాయి. దాంతో ఐపీఎల్ లో పాల్గొనకుండా అతడి పై నిషేదం విధించబడింది. 2018లో బిట్ కాయిన్ కుంభకోణంలోనూ రాజ్ కుంద్రాపై ఆరోపణలు వచ్చాయి.  అప్పట్లో ఈడీ ఆయనను విచారించింది. అంతే కాదు గతంలో ఆయన మహిళలను కించపరిచేలా కొన్ని వివాదాస్పద ట్వీట్స్ కూడా చేశారు. 

click me!